స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు టీఆర్‌ఎస్ సాధించాలి


Thu,April 18, 2019 11:27 PM

వికారాబాద్ టౌన్ : రాబోయే స్థానిక ఎన్నికల్లో అత్యధికంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం పట్టణంలోని సబితానంద్ ఆసుపత్రి కాన్ఫరెన్స్ హాలులో మర్పల్లి మండల నాయకులతో ముఖ్య కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీల స్థానాలు గెలిపించుకోవాలన్నారు. స్థానిక ఎన్నికల్లో కూడా మన టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగురవేయాలన్నారు. వర్గబేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేస్తే పార్టీ ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాలల్లో ప్రజలు టీఆర్‌ఎస్ వైపు నడిచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నడిపించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండి ఎంపీటీసీ, జడ్పీటీసీ టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు కలిసి మెలసి టీఆర్‌ఎస్ పార్టీ గెలిచేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. అదే విధంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా అందరు కలిసి మెలిసి పని చేసి జడ్పీటీసీ, ఎంపీటీసీల అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి టీఆర్‌ఎస్ పార్టీ సత్తా చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్‌రెడ్డి, మర్పల్లి మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...