కోరిన కోరికలు తీర్చే హర్ష లింగేశ్వరుడు


Thu,April 18, 2019 11:27 PM

వికారాబాద్ రూరల్ : జిల్లాలో అతి పురాతన ఆలయా లు ఏన్నో ఉన్నాయి. జిల్లాలో అతి ముఖ్యమైన ఆలయం అనంతగిరి పుణ్య క్షేత్రం. దీనికి 7 కిమీ దూరంలో మండలంలోని మదన్‌పల్లి గ్రామ సమీపంలో స్వయంగా వెలిసిన హర్ష లింగేశ్వరుడుగా అదే విధంగా సంగయ్య లోంకగా పేరు పొందాడు. ఈ ఆలయం కొండపైన ఉంటుంది. ఆలయంపై నుంచి చూస్తే 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న కోట్‌పల్లి గ్రామం కన్పిస్తున్నది. ఆలయంలో విద్యా గణపతి, వీరభద్రుడు, నందీశ్వరుడు భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఆలయంలో చాలా ఏండ్ల క్రితం తవ్వించిన గుండం ఉంది. వేసవిలో సైతం నీరు ఇంకిపోకుండా ఎప్పుడు కళకళలాడుతున్నది. ఆలయంలో శ్రావణమాసం నాడు కార్తీక దీపారాధన తప్పని సరిగా జరుగుతున్నది. ఆలయంలో పౌర్ణమి, అమావాస్య రోజు ప్రత్యేక పూజలు, ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. అలాగే స్వామివారికి వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయానికి అనేక మంది భక్తులు వివిధ గ్రామాల నుంచి వచ్చి పూజాలు నిర్వహిస్తున్నారు. స్వామి వారి ఉత్సవాలు ప్రతి ఏటా వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈసారి కూడా ఉత్సవాలను గ్రా మస్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే గురువారం స్వా మి వారికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూ జాలు, గంగా పూజ కార్యక్రమాలు ని ర్వహించారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు అగ్నిగుండం, సాయంత్రం రథోత్సవం నిర్వహిస్తారు. ఎండోమేంటల్ అధికారులు స్పందించి ఈ పురాతన ఆలయాన్ని అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ప్రభుత్వం ఆలయాన్ని గుర్తించాలి...
తెలంగాణ ప్రభుత్వం అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తున్నది. మదన్‌పల్లిలోని సంగయ్య లోంక (హర్ష లింగేశ్వరుడు) ఆలయాన్ని కూడా గుర్తించి అభివృద్ధి చేయాలి. పురాతన ఆలయంగా పేరుగాంచిన హర్ష లింగేశ్వరుడి ఆలయానికి ఎన్నో ఏండ్ల చరిత్ర ఉంది. భక్తుల కోరికలు తీర్చే హర్ష లింగేశ్వరుడుగా ఉన్నాడు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు 20 వేల మంది భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఆలయంలో ఈ ఆలయం కూ డా ఉంది.
- విజయ్‌కుమార్, ఆలయ పూజారి

స్వయంగా వెలిసిన హర్ష లింగేశ్వరుడు...
ఆలయంలో సంగమేశ్వరు డు స్వయంగా వెలిశాడని పెద్ద లు చెప్తుంటారు. ఆలయం అభివృద్ధి చేయాల్సి ఉంది. ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్య త అందరిపై ఉంది. ప్రస్తుతం ఆలయ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ ఆలయానికి ప్రభుత్వం అందించే ధూప దీప నైవేద్యం పథకం వర్తింపజేస్తాను. ఆలయ అభివృద్ధికి పాటు పడుతాను. ఆలయంలో భక్తులు ఉండేందుకు షెడ్లు ప్రభుత్వం నుం చి వేయించాలని కోరారు.
- బండ రాజు, సర్పంచ్

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
ధారూరు : జరుగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని ఈవోపీఆర్డీ మున్నయ్య తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని సమావేశ మందిరంలో పీవో, ఏపీవోలతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాల్లో నిర్లక్ష్యం వహించకూడాదన్నారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, మరుగుదొడ్లు, మంచినీరు ఏర్పాటు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పై అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో జోనల్ అధికారులు బాబుసింగ్, రాంబాబు, ఎన్నికల సిబ్బంది, పీవో, ఏపీవోలు పాల్గొన్నారు.

పీవో, ఏపీవోలకు శిక్షణ
నవాబుపేట : త్వరలో జరుగనున్న ఎన్నికలకు సంబంధించి విధులు నిర్వహించే పీవో, ఏపీవోలకు గురువారం మండల కార్యాలయంలో ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రారంభం నుంచి ఫలితాలు వెల్లడించే వరకు చేపట్టాల్సిన ప్రతి కార్యక్రమాన్ని శిక్షకులు వివరించారు. నిబంధనలకు అనుకూలంగా అప్పగించిన పనులను విజయవంతంగా చేపట్టాలని వారు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుమిత్రమ్మ, మాస్టర్ ట్రేనర్స్ పాండు, రాంరెడ్డి, విద్యాధికారి గోపాల్, ఈవోఆర్డీ అనిత, పీవో, ఏపీవోలు పాల్గొన్నారు.

సిబ్బంది ఎన్నికలకు సిద్ధం కావాలి
మోమిన్‌పేట : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో నిర్వహించాల్సిన విధుల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బ్యాలెట్ పద్ధతిలో ఓటర్లను ఓటింగ్ వేసే విధానాన్ని ఎంపీడీవో శైలజారెడ్డి పీవోలు, ఏపీవోలకు వివరించారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ ఉంటుందని, మండలంలోని మొత్తం 75 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఓటింగ్ సమయంలో పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్లు ఫోన్లు తీసుకువెళ్ల్లకూడాదని, ఓటర్లు కూడా ఫోన్ తీసుకురాకూడాదని పేర్కొన్నారు. గ్రామాల్లో ఓటర్ల కు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ లక్ష్మి, ఎస్సై రవికుమార్, ఏపీఎం ఆనంద్ పాల్గొన్నారు.

ఎన్నికల విధానాలపై సిబ్బందికి శిక్షణ
మర్పల్లి : రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా అసిస్టెంట్, రిటర్నింగ్ అధికారులకు గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో నాగలక్ష్మి ఎన్నికల విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు త్వరలో జరుగుతాయని అందులో భాగంగా ఎన్నికల సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఎన్నికలకు సజావుగా నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి అధికారి సమన్వయంతో విధులు నిర్వహించి వంద శాతం పోలింగ్ జరిగే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో పీవో, ఏపీవో అధికారులు పాల్గొన్నారు.

విధులను సక్రమంగా నిర్వహించాలి
బంట్వారం : ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించాలని ఎంపీడీవో సుశీల్ కుమార్ సూచించారు. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గురువారం మండల పరిషత్ కార్యాలయంలో పీవో, ఏపీవోలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్యాలెట్ బాక్సులను పంపిణీ కేంద్రం నుంచి తీసుకెళ్లాలన్నారు. బ్యాలెట్ బాక్స్‌లను ఉపయోగించే విధానాన్ని అధికారులు సూచించే పద్ధతిని తప్పక పాటించాలని చెప్పారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ లక్ష్మీనారాయణ, సుదర్శన్ పాల్గొన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...