మూలనపడ్డ స్వచ్ఛ భారత్ ట్రై సైకిళ్లు


Wed,April 17, 2019 11:29 PM

పరిగి రూరల్ : గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలనే సదుద్దేశంతో స్వచ్ఛ భారత్, ఆర్‌డబ్లూఎస్ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన చెత్తను తొలిగించే ట్రైసైకిళ్లు డంపింగ్ యార్డులు లేక మూలనపడ్డాయి. స్వచ్ఛ భారత్‌లో భాగంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం మండలంలోని 22 గ్రామ పంచాయతీలకు గాను ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా మేజర్ గ్రామాలకు నాలుగు, చిన్న గ్రామాలకు రెండు చోప్పున మొత్తం 46 సైకిళ్లను 3 ఏండ్ల క్రితం పంపిణీ చేశారు. అయితే వీటి నిర్వహణ పంచాయతీలకు అప్పగించారు. ఈ సైకిళ్లకు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి గ్రామంలో పోగైన చెత్తను సైకిళ్లలో వేసుకొని డంపింగ్ యార్డుకు చేరవేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికీ డంపింగ్ యార్డులు లేకపోవడంతో చెత్తను ఎక్కడ వేయాలో తెలియక ఎక్కడ పడితే అక్కడ ప్రజలు పడవేస్తున్నారు. పంచాయతీల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించి అక్కడ డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయాల్సి ఉంది. గ్రామాల్లో డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ స్థలాలు లేకపోవడంతో చెత్తను తొలిగించే సైకిళ్లు గ్రామ పంచాయతీల ఆవరణలోనే తప్పు పడుతున్నాయి. సంబంధిత ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి డంపింగ్ యార్డుల ఏర్పాటుకు చొరవ తీసుకొని ట్రై సైకిళ్లును వినియోగంలోకి తీసుకురావాలని మండల ప్రజలు కోరుతున్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...