మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలి


Wed,April 17, 2019 11:28 PM

వికారాబాద్ టౌన్ : స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పెండింగ్‌లో ఉన్న మరుగుదొడ్లను యుద్ధప్రాదిపతికన పూర్తి చేయాలని కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా తెలిపారు. బుధవారం వికారాబాద్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, జిల్లా స్థాయి ప్రత్యేకాధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయా మండలాల్లో చేపట్టినా, చేపట్టాల్సిన పనులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీ ణ ప్రాంతాల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం కోసం మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడం అనే ముఖ్య ఉద్దేశంతో ప్రభు త్వం బహిరంగ మలవిసర్జన రహిత గ్రా మాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల నిర్వహణ కారణంగా స్వచ్ఛ భారత్ పనులు పూర్తి చే యలేకపోయామని, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ఎంపీడీవోలు, తహసీల్దార్లతో పాటు ప్రతి మండలానికి జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేకాధికారులుగా నియమించడం జరిగిందన్నారు. అందరూ సమన్వయంతో ప్రతి గ్రా మాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు.

గ్రామాల్లో పండుగ వాతావరణంలా ఒక రోజు ఏర్పాటు చేసుకొని పనులు ప్రారంభించాలని సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణం కొరకు ప్రభు త్వం రూ.12వేలు ఇవ్వడం జరుగుతుందని, ప్రజలకు తెలియజేసి ముందుకురాని వారికి అవగాహన కల్పించాలన్నారు. అందుకు మహిళ సంఘాల సహకారంతో గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలు గా ప్రకటించాలని సూచించారు. కార్యక్రమంలో జా యింట్ కలెక్టర్ అరుణకుమారి, డీఆర్‌వో మోతీలాల్, డీఆర్‌డీవో జాన్సన్, ఆర్డీవోలు విశ్వనాథం, వేణుమాధవ్‌రావు, జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...