ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి


Tue,April 16, 2019 11:20 PM

-నూతన దవాఖాన నిర్మాణం పూర్తి చేయండి
- త్వరలోనే అందుబాటులోకి రానున్న దవాఖాన
- ఇటీవల మృతి చెందిన దంపతుల కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించండి
- కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా
-ప్రభుత్వ దవాఖాన ఆకస్మికంగా తనిఖీ
వికారాబాద్, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కోట్లు ఖర్చు చేస్తూ అన్ని సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం పట్టణ ంలోని ప్రభుత్వ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించిన వారికి ఉత్తమ సేవలు అందించాలన్నారు. దవాఖానలో అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం వైద్యులను నియమించడం జరిగిందన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు సేవలందించాలన్నారు. ద వాఖానలో అన్ని రకాల వైద్య సేవలు, పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రజలకు సరైన వైద్య సేవలు అందించని వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించా రు. ఎస్‌ఏపీ కళాశాల సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న దవాఖానను త్వరగా పూర్తి చేసి ప్రజలకు సేవ లు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

సమన్వయంతో పని చేసి అభివృద్ధికి కృషి చేయాలి
అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి అభివృద్ధికి కృషి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వికరాబాద్ కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భ ంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల ధారూ రు మండల కొండపూర్‌లో విద్యుత్ తీగ లు పడి దంపతులు మృతి చెందిన కు టుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆదేశించారు. విద్యుత్ వైర్లు ఎక్కడైన వేలాడుతున్న సంఘటనలు దృష్టికి వస్తే వెం టనే సరి చేయాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర ఆదేశించారు. అదే విధంగా హరితహారంలో అన్ని శాఖలకు కేటాయించిన టార్గెట్‌ను ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకొని లక్ష్యాన్ని అధిగమించాలన్నారు. వేసవి దృష్టిలో ఉంచుకొని తాగునీటి కొరత ఉన్నటువంటి గ్రామాలను గుర్తించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మంచినీటి వసతి కల్పించాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యుత్, తాగునీటి సమస్యలను తీర్చాలని ఆమె తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌వో మోతిలాల్, డీఆర్డీవో జాన్సన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

వైభవంగా కోదండరాముడి కల్యాణం
పెద్దఅంబర్‌పేట: కుంట్లూర్‌లోని కాశీబుగ్గ సీతారామచంద్రస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. దేవాయల అభివృద్ధ్దికి తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. కుంట్లూర్‌లోని దేవాలయంలో ఆలయ చైర్మన్ పెద్దిటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం అర్ధరాత్రి జరిగి ఈ కల్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. నియోజకవర్గంలోని ప్రధాన దేవాలయాలను అభివృద్ధి చేస్తానని, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దేవాలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారో యాదాద్రిని చూ స్తే అర్థం అవుతుందని అన్నారు. ప్రతి ఏటా ఇటువంటి కల్యాణాలు వైభోగంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు.

అబ్దుల్లాపూర్‌మెట్‌లో..
మూడు రోజులుగా వైభవంగా జరుగుతున్న కోదండరామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణోత్సవాన్ని జరిపించారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లిలో వెలసిన కోదండ రామచంద్రస్వామి వారి కల్యాణాన్ని ఆలయ కమిటీ నిర్వాహకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణోత్సవానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీపీ బబ్బూరి మంజులగౌడ్, వైస్‌ఎంపీపీ రంగ యశోద హాజరయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, రాములోరి కల్యాణాన్ని తిలకిచారు. స్వామివారికి సర్పంచ్ దూసరి సుజాతయాదయ్యగౌడ్ పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
బొగ్గులగట్టుపై అన్నదానం
యాచారం: నల్లవెల్లిలోని బొగ్గులగట్టుపై కొలువుదీరిన సీతారామచంద్రస్వామి దేవాలయంలో భక్తులు సోమవారం పూజలు చేశారు. ఆలయంలో సీతారామాంజనేయ స్వాములను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు సర్పంచ్ డేరంగుల రాజు, ఉపసర్పంచ్ పోలెపల్లి వినోద్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...