మొక్కల పంపిణీకి సిద్ధం చేయాలి


Tue,April 16, 2019 11:19 PM

- జిల్లా డీఆర్డీవో పీడీ జాన్సన్
మర్పల్లి : పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో తొమ్మిది లక్షల మొక్కలను పంపిణీకి సిద్ధం చేయాలని జిల్లా ఉపాధి హామీ పథకం, డీఆర్డీవో పీడీ జాన్సన్ ఆదేశించారు. సోమవారం మండల పరిధిలోని కోత్లాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో ఏర్పాటు చేసిన నర్సారీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై మొదటి వారం నుంచి ప్రభుత్వం హరితహారంలో భాగంగా మొక్కలను పంపిణీ చేసే కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. అందుకు సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా నర్సరీలో పెం చుతున్న మొక్కలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలన్నారు. ప్రతి రోజు ఉదయం, సాయ ంత్రం తప్పనిసరిగా మొక్కలకు నీళ్లు పట్టాలన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మొక్కల పెంపకంపై సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చారించారు. కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

అందుబాటులోకి తీసుకురావాలి
మోమిన్‌పేట : ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీలో జూన్‌లోగా మొక్కలు అందుబాటులోకి తీసుకురావాలని, అందకు అన్ని ఏర్పాటు పూర్తి చేసుకోవాలని జాన్సన్ అన్నారు. మండల పరిధిలోని చీమల్‌దరి గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీని తనిఖీ చేశారు. నర్సరీ లో ఏర్పాటు చేసి ప్రైమరీ బెడ్లను పరిశీలించారు. నాటిన విత్తనాల మొక్కలు ఎంత శాతం పెరిగాయని వన సేవకులను అడిగి తెలుసుకున్నారు. నర్సరీలో నీటి ఎద్దడి ఏర్పడే పరిస్థితి ఉన్నట్లయితే గ్రామ పంచాయతీలు ముందుగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నర్సరీలో మొక్కలకు ప్రతి రోజు నీళ్లు పడుతున్నారా లేదా విషయాలను అడిగి తెలుసుకున్నారు. హరితహారం కార్యక్రమం సమయానికి అన్ని నర్సరీల్లో మొక్కలు అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీవో శంకరయ్య, నర్సరీ సిబ్బంది పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...