విధుల్లో చేరిన పంచాయతీ కార్యదర్శులు


Tue,April 16, 2019 01:00 AM

నవాబుపేట : గ్రామ పంచాయతీల 16 మంది కార్యదర్శులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వీరికి సీనియర్ కార్యదర్శులు మండల కార్యాలయంలో విధి విధానాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. క్షేత్ర స్థా యిలో వ్యహరించాల్సిన విధానాలను వివరించారు. ప్రజా సమస్యలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయా గ్రామా ల వారీగా కార్యదర్శులు శోభారాణి ఎక్‌మామిడి, అరుంధతి కడ్చర్ల, విజయ్‌కుమార్ మాదిరెడ్డిపల్లి, అనిల్‌కుమార్ మైతబ్‌ఖాన్‌గూడ, ప్రియాంక మూబారక్‌పూర్, నరేశ్‌కుమా ర్ గుల్లగూడ, చంద్రకళ అత్తాపూర్, నీరజ కేశవపల్లి, వి.శో భ తిమ్మారెడ్డిపల్లి, శ్వేత యావపూర్, గీత లింగంపల్లి, భానుప్రియ పూలపల్లి, అశోక్‌కుమార్ వట్టిమీనపల్లి, సాయిశృతి మమ్మదాన్‌పల్లి కార్యర్శులుగా బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ కార్యదర్శులు నవీన్‌కుమార్ కమ్రుద్దిన్, గంగ్యాడ నర్సింహులు, చిట్టిగిద్ద లావణ్య, మాదారం వేణుకుమార్, గుబ్బడిఫత్తేపూర్ శివకృష్ణ, నవాబుపేట రామకృష్ణ, చించల్‌పేట వెంకటలక్ష్మి గ్రామాలకు కొనసాగుతున్నారు. ఈ కా ర్యదర్శుల రాకతో గ్రామాల్లో సమస్యలు పరిష్కారానికి అవకాశం ఏర్పడింది.

విధుల్లో చేరిన కార్యదర్శులు
బంట్వారం : ఉమ్మడి బంట్వారం మండలానికి 15 మంది కార్యదర్శులు విధుల్లో చేరారని ఎంపీడీవో శుశిల్‌కుమార్ చెప్పారు. కోట్‌పల్లి మండలానికి 6 గురు కార్యదర్శు లు, బంట్వారం మండలానికి 9 మంది కార్యదర్శులు విధు ల్లో చేరరన్నారు. వీరంతా మంగళవారం నుంచి కేటాయించిన గ్రామాలకు వెళ్లాలని సూచించడం జరిగిందన్నారు.

కార్యదర్శులకు సూచనలు, సలహాలు
మోమిన్‌పేట : గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే గ్రామానికో కార్యదర్శి అవసరమని ప్రభుత్వం భావి ంచి ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శిని నియమించడం జరిగిందని ఎంపీడీవో శైలజారెడ్డి అన్నారు. మండల కేంద్రం లో కొత్తగా నియామకమైన కార్యదర్శుల పరిచయం అనంతరం వారికి సూచనలు, సలహాలు అందించారు. ఎన్నికల విధులు ఎలా నిర్వహించాలి, గ్రామాల్లో ఎలాంటి సమస్య లు ఎక్కువగా ఎదురవుతాయి, ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని ఎలా పూర్తి చేశారనే విషాయాలను వారికి వివరించారు. కా ర్యక్రమంలో ఎంపీడీవో సిబ్బంది శ్రీనివాస్, శాంత, కార్యదర్శులు పాల్గొన్నారు.

ప్రతి పల్ల్లెకు గ్రామ కార్యదర్శి
ధారూరు : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో కార్యదర్శులు వచ్చారని ఎంపీడీవో కార్యాలయ సూపరిటెండెం ట్ చంద్రశేఖర్ తెలిపారు. మండల పరిధిలో 32 గ్రామ పం చాయతీలకు గాను ఏడుగురు కార్యదర్శులు ఉండే వారు. ప్రస్తుతం కొత్త కార్యదర్శులు 20 మంది రాకతో మండలం లో మొత్తం 27 మంది అయ్యారని, ఇంకా ముగ్గురు రావా ల్సి ఉందన్నారు. మండల పరిధిలోని రుద్రారం గ్రామానికి జి.నర్సింహులు, ఎబ్బనూర్‌కు ఎండి.నహిమోద్దీన్, గురుదోట్లకు ఎండి.మహబుబ్, మున్నూర్ సోమరం గ్రామానికి ఎం.రాజు, కుమ్మర్‌పల్లికి కె.యాదమ్మ, అవుసుపల్లికి జి.తి రుపతి, చింతకుంటకు ఎన్.రాజ్‌కుమర్, అంతారం గ్రామానికి ఎం.వసంత, అల్లాపూర్‌కు కల్పన, కొండాపూర్‌కలాన్ కు ఎం.ప్రసన్న, అంపల్లికి కె.శైలజ, కెరెళ్లికి కె.శ్రావణి, మో మిన్‌ఖుర్దుకు ఎ.సుమలత, రాజాపూర్‌కు స్పందన, హరిదాస్‌పల్లికి అబ్దుల్ ఇసాద్, మైలారం గ్రామానికి టి.మమ త, గడ్డమీది గంగారం గ్రామానికి ఎండి.హరీఫ్ ఖాన్, పులిచింతల మడుగు తండాకు పి.అనిల్‌కుమర్, రాంపూర్‌కు పి.బాలకృష్ణ, ధర్మాపూర్‌కు శివ సాయి రాఘవలను ప్రభు త్వం నియమించిందని ఆయన తెలిపారు.

నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేయాలి
ధారూరు :గ్రామాల్లో వన నర్సరీల్లో వచ్చే వాన కాలం నాటికి మొక్కలను సిద్ధం చేయాలని ఏపీ వో సురేశ్ పేర్కొన్నారు. సోమవారం మండల కేం ద్రంలోని సమావేశ మందిరంలో నూతన జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు హరితహారం, స్వచ్ఛ భారత్‌పై అవగాహన కల్పించారు. వన న ర్సరీల్లో ఎలాంటి మొక్కలు ఏర్పాటు చేయాలనే అంశాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ నర్సరీల్లో మొక్కలను పెంచే ందుకు విధంగా చూడాలన్నారు. గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా చూడాలన్నా రు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సూరిబాబు, నూతన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...