జిల్లాలో ఓటర్లు 8,93,143


Mon,March 25, 2019 11:44 PM

- ఓటర్ల తుది జాబితా విడుదల
- పురుష ఓటర్లు 4,46,441 మంది..
- మహిళా ఓటర్లు 4,46,685..
- ఇతరులు 21 మంది, మహిళా ఓటర్లే అధికం
- జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పెరిగిన 8866 మంది ఓటర్లు
- అత్యధికంగా పరిగి నియోజకవర్గంలో 2,43,347 మంది ఓటర్లు
- అత్యల్పంగా తాండూరు నియోజకవర్గంలో 2,14,274 మంది ఓటర్లు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాకు సంబంధించి ఓటర్ల తుది జాబితాను సోమవారం విడుదల చేసింది.జిల్లాలో 8,93,143మంది ఓటర్లున్నట్లు సంబంధిత అధికారులు ఓటరు జాబితాలో ప్రకటించారు. అయితే జిల్లాలోని పరిగి నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు ఉండగా,... తాండూరు నియోజకవర్గంలో అత్యల్పంగా ఓటర్లు ఉన్నారు. మరోవైపు తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లోమహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం జనవరిలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంతో 8,84, 277 మంది ఓటర్లకు పెరుగగా,...తాజాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంతో 8866 మంది ఓట ర్లు కొత్త ఓటర్లుగా జాబితాలో చేరారు. అయితే జిల్లావ్యాప్తం గా పురుషల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండడం గమనార్హం. అంతేకాకుండా ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం తో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ ఓటర్లు పెరుగగా,..తాండూరు నియోజకవర్గంలో అత్యధికంగా ఓటర్లు పెరుగగా,...అత్యల్పంగా వికారాబాద్ నియోజకవర్గంలో కొత్త ఓటర్లుగా నమోదయ్యారు.అయితే ఫిబ్రవరిలో రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటరు ముసాయిదా జాబితా ప్రకా రం జిల్లావ్యాప్తంగా 8,84,277 మంది ఓటర్లు ఉండగా ...పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంతో 8,93,143 మంది ఓటర్లుకు పెరగడం జరిగింది.

అయితే జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 18-19 ఏండ్ల మధ్య ఉన్న ఓటర్లు మొత్తం 24,521 మంది ఉన్నారు. జిల్లాలో మొత్తం 8,93,143 మంది ఓటర్లుండగా, పురుషులు-4,46,441, మహిళలు-4,46,685 మంది మహిళా ఓటర్లు, ఇతరులు-21 మంది ఓటర్లు ఉన్నారు. పరిగి నియోజకవర్గంలో మొత్తం 2,43,347 మంది ఓటర్లుండగా పురుషులు-1,23,641మంది ఓటర్లు, మహిళా ఓటర్లు-1,19, 702 ఇతరులు-నలుగురు ఓటర్లున్నారు.వికారాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,19,709 మంది ఓటర్లుండగా పురుషులు-1,10,862 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు-1,08,846 మంది ఓటర్లు, ఇతరులు-1 ఓటర్లున్నారు. తాం డూరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,14,274 మంది ఓటర్లుండగా పురుషులు-1,04,713 మంది ఓటర్లు, మహిళలు-1,09,553 మంది ఓటర్లు, ఇతరులు-8 మంది ఓటర్లున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,15,817 మంది ఓటర్లుండగా పురుషులు-1,07,225 మంది ఓటర్లు, మహిళలు-1,08,584 మంది ఓటర్లు, ఇతరులు-8 మంది ఓటర్లున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా కొత్తగా 8846 వేల మంది ఓటర్లు ఓటరు జాబితాలో చేరారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 8,40,525 మంది ఓటర్లుండగా ఫిబ్రవరిలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌తో 8,84,277కు ఓటర్లకు, ప్రస్తుతం 8,93,143 మందికి ఓటర్ల సంఖ్య పెరిగింది. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా 1126 పోలింగ్ కేంద్రాలుండగా పరిగి నియోజకవర్గంలో 305 పోలింగ్ కేంద్రాలు, వికారాబాద్ నియోజకవర్గంలో 284 పోలింగ్ కేంద్రాలు, తాండూరు నియోజకవర్గంలో 262 పోలింగ్ కేంద్రాలు, కొడంగల్ నియోజకవర్గంలో 275 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.

పెరిగిన 8866 మంది వేల ఓటర్లు...
పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 8866 మంది ఓటర్లు పెరిగారు. అత్యధికంగా తాండూరు నియోజకవర్గంలో కొత్త ఓటర్లుగా చేరగా,..పరిగి నియోజకవర్గంలో అత్యల్పంగా కొత్త ఓటర్లు చేరారు. ఆయా నియోజకవర్గాల్లో కొత్త ఓటర్లుగా చేరిన వారిలో పరిగి నియోజకవర్గంలో 1336 మంది ఓటర్లు, వికారాబాద్ నియోజకవర్గంలో 2243 మంది ఓటర్లు, తాండూరు నియోజకవర్గంలో 3506 మంది ఓటర్లు, కొడంగల్ నియోజకవర్గంలో 1785 మంది ఓటర్లు కొత్తగా ఓటరు జాబితాలో చేరారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమానికి ముందు జిల్లాలోని ఓటర్ల వివరాలకు సంబంధించి,...జిల్లాలో మొత్తం 8,84,277 మంది ఓటర్లుండగా, పురుషులు-4,42, 299, మహిళలు-4,41,599 మంది మహిళా ఓటర్లు, ఇతరులు-15 మంది ఓటర్లు ఉన్నారు. పరిగి నియోజకవర్గంలో మొత్తం2,41,843 మంది ఓటర్లుండగా పురుషులు-1,22, 943 మంది ఓటర్లు,మహిళా ఓటర్లు-1, 18,896, ఇతరులు నలుగురు ఓటర్లున్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,17,412 మంది ఓటర్లుండగా పురుషులు-1,09,847 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు-1,07,564 మంది ఓటర్లు, ఇతరులు-1 ఓటర్లున్నారు. తాండూరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,10,736 మంది ఓటర్లుండగా పురుషులు-1,03,113 మంది ఓటర్లు, మహిళలు-1,07,618 మంది ఓటర్లు, ఇతరులు-5 మంది ఓటర్లున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,13,922 మంది ఓటర్లుండగా పురుషులు-1,06,396 మంది ఓటర్లు, మహిళలు-1,07,524 మంది ఓటర్లు, ఇతరులు-5 మంది ఓటర్లున్నారు.

18-19 ఏండ్ల మధ్య ఓటర్లు 24,521 మంది
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం 24,521 మంది ఓటర్లున్నారు. 18-19 ఏండ్ల మధ్య ఉన్న ఓటర్లు ఫిబ్రవరిలో 22,016 మంది ఓటర్లుండగా ప్రస్తుతం వారి సంఖ్య 24,521 మంది ఓటర్లకు పెరిగింది. నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం 2505 మంది 18-19 ఏండ్ల మధ్య ఓటర్లు పెరిగినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అదేవిధంగా 18-19 ఏండ్ల మధ్య ఉన్న ఓటర్లకు సంబంధించి,...పరిగి నియోజకవర్గంలో 7033 మంది ఓటర్లు, వికారాబాద్ నియోజకవర్గంలో 5132 మంది ఓటర్లు, తాండూరు నియోజకవర్గంలో 5870 మంది ఓటర్లు, కొడంగల్ నియోజకవర్గంలో 6486 మంది ఓటర్లు ఉన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...