ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి


Mon,March 25, 2019 11:42 PM

మోమిన్‌పేట : ఉపాధి హామీ పనులను గ్రామీణులు సద్వినియోగం చేసుకోవాలని మోమిన్‌పేట ఎంపీడీఓ శైలజారెడ్డి కోరారు. సోమవారం మండల పరిధిలోని చంద్రాన్‌పల్లి గ్రామంలో ఊటకుంటలో పూడికతీత పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిబంధనల ప్రకారం పనులు చేయాలని, పని చేసే ప్రదేశంలో తాగునీరు, టెంట్, ప్రథమ చికిత్స కిట్టు తప్పనిసరిగా ఉంచుకోవాలన్నారు. కూలీలు చేసిన పనిని ఎప్పటికప్పుడు కొలతలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో పనులు చేయాలని కూలీలకు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో చంద్రాన్‌పల్లి సర్పంచ్ అంజయ్య, ఉపాధిహామీ ఏపీఓ శంకరయ్య, ఫీల్డ్‌అసిస్టెంట్లు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

ఓటు హక్కు బాధ్యతగా గుర్తించాలి..
ఓటు హక్కు అనేది మన బాధ్యతగా గుర్తించి నచ్చిన వ్యక్తికి ఓటు వేయాలని చంద్రాన్‌పల్లి గ్రామస్తులకు ఎంపీడీవో శైలజారెడ్డి సూచించారు. ఎన్నికల విధుల్లో భాగంగా ఓటుక్కు పై ప్రార్థన చేయించారు. వచ్చే నెల 11వ తేదీన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోవాలి
మర్పల్లి : ప్రతి ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోవాలని సర్పంచ్ ఇందిరా అశోక్ అన్నారు. సోమవారం పట్లూర్ గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకున్న పదిమంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మరుగుదొడ్డి నిర్మించుకున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రూ.12వేల నగదు అందజేస్తుందన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు డబ్బులు రాకపోతే తమ దృష్టికి తీసుకొస్తే, వెంటనే ఇప్పిస్తామన్నారు. గుర్రంగట్టుతండాలో సర్పంచ్ సోనిబాయి ఇంటింటికి వెళ్లి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ప్రజలతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో అంజిరెడ్డి, కార్యదర్శి సంతోశ్, నాయకులు అశోక్, రవి, శ్రీశైలం, సంతోశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...