ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఓటెయ్యాలి


Mon,March 25, 2019 12:04 AM

వికారాబాద్ రూరల్ : ప్రతి ఒక్క పౌరుడు తమ ఓట్లను నిజాయితీగా,నిస్పక్షపాతంతో ఓట్లు వినియోగించుకోవాలని కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా అన్నారు. ఆదివారం ద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెక్రో అబ్జార్‌వార్లకు ఎన్నికల నిబంధనలు తెలిపారు. అంబేద్కర్ భవన్‌లో నియోజక వర్గ సర్పంచులకు వీవీ ప్యాట్, ఈవీఎంలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచులచే వీవీ ప్యాట్స్ పని తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ ప్రథమ పౌరులకు వీవీ ప్యాట్స్, పై తప్పక అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎంపీ ఎలక్షన్‌లలో 100 శాతం పోలింగ్ జరిపించాలన్నారు. అన్ని గ్రామాలల్లో 100 పోలింగ్ జరిగేలా సర్పంచులు చొరవ చూపించాలన్నారు. జిల్లాలో గత డిసెంబర్ మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలల్లో 77 శాతం ఓట్లు పోలయ్యాయన్నారు. జనవరిలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో 95 శాతం పోలింగ్ జరిగిందన్నారు. ఎన్నికలల్లో గ్రామ పంచాయతీ ద్వారానే ఓట్లు అధికంగా పోలవుతాయన్నారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో కేంద్ర రాష్ర్టాల మధ్య సత్సంబంధాలు బలంగా ఉండాలంటే పార్లమెంట్ ఎన్నికలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు.

గ్రామాలల్లో పట్టణల్లో ఓటర్లను చైతన్యం చేసేందుకు అధికారులు ప్రతి గ్రామంలో అవగహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఉచితంగా ప్రభుత్వం నుంచి ఆటో ఇతర సౌకర్యం కల్పించి ఓట్లు 100 శాతం పోల్ చేస్తామన్నారు. వికారాబాద్ జాయింట్ కలెక్టర్ అరుణ కుమారి మాట్లాడుతూ వచ్చే నెల 11 న జరిగే ఎంపీ ఎలక్షన్‌లను పకడ్బందీగా జరుపాలన్నారు. సంవత్సరం నుంచి వీవీ ప్యాట్స్ ద్వారా ఎన్నికలు జరుగుతాయన్నారు.ప్రతి ఒక ఎన్నికల అధికారి మాక్ పోలింగ్ జరిగిన వెంటనే వీవీ ప్యాట్‌లను క్లియర్ చేయాలన్నారు. గ్రామ సర్పం గ్రామ అభివృద్ధ్దితో పాటు వీవీ ప్యాట్స్ పై గ్రామస్తులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో విశ్వనాథం, జిల్లా గిరిజన అభివృద్ధి కోటాజీ సర్పంచ్‌లు తదితరులున్నారు.

ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కృషి చేయాలి
వికారాబాద్, నమస్తే తెలంగాణ :పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు మైక్రో అబ్జర్‌వర్లు ప్రతి ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలిస్తూ పోలింగ్ సిబ్బందికి సమయానుకూలంగా సూచనలు ఇస్తుండాలని కలెక్టర్ మస్రత్‌ఖానమ్ తెలియజేశారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మైక్రో అబ్జర్‌వర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగు తెలిపారు. పోలింగ్ ప్రారంభానికి ముందు 6 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిం పోలింగ్ సిబ్బంది వివ సిబ్బంది పూర్తి చేయాల్సిన 5 ఫారాలు, 17సి పోలింగ్ అధికారి డైరీ, 17ఏ మాక్ పోల్ సర్టిఫికెట్, పీవో డిక్లరేషన్ లాంటిది డాక్యూమెంట్ల పూర్తితో పాటు ఇట్టి డా సంబంధిత అధికారులకు అప్పజెప్పాల్సి ఉంటుందన్నారు. మాక్ పోలింగ్ తరువాత సీఆర్‌సీ చేసి ఈవీఎంలను తప్పకుండా క్లీన్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో జాన్సన్, డీఎస్‌సీడీవో విజయలక్ష్మీ, జిల్లా సివిల్‌సైప్లె మేనేజర్ విమళ, తహసీల్దార్ చిన్నప్పలనాయుడు తదితరులు ఉన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...