ప్రజల సమస్యలు పరిష్కరిస్తా


Mon,March 25, 2019 12:02 AM

తాండూరు, నమస్తే తెలంగాణ: తనను ఎంపీగా గెలిపిస్తే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని అందరికి అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని చేవెళ్ల టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల దిశానిర్ధేశంతో వారి నాయకత్వంలో వచ్చే ఐదేండ్లు ప్రజల కోసం పనిచేసేందుకే పూర్తి సమయం వెచ్చిస్తానన్నారు. తాను జిల్లా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని, ఎన్నో ఏండ్లుగా జిల్లా పరిధిలోని ప్రజలతో తనకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో జిల్లా సమస్యల పట్ల తనకు అవగాహన ఉందన్నారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు ప్రజల అవసరాలు తీరుస్తానని ఆదివారం తాండూరు పట్టణంలో టీన్యూస్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. తాండూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నాపరాళ్ల గనుల తవ్వకాలు సాగుతుండడం, వాటి వినియోగంతో పెద్ద ఎత్తున నాపరాల్ల పాలిషింగ్ పరిశ్రమలు ఏర్పాటు కావడంతో ఈ ప్రాంతంలో పారిశ్రామిక వాడ అవసరమన్నారు.

ఈ పారిశ్రామిక వాడ ఏర్పాటుకు తాను సీఎం కేసీఆర్ చొరవతో కృషి చేస్తానని అన్నారు. అలాగే తాండూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున కంది పంటను సాగు చేస్తుండడంతో ఈ ప్రాంత రైతులకు ప్రయోజనం కల్పించేలా, కంది సాగు విస్తీర్ణానాన్ని మరింత పెంచేందుకు కంది బోర్డును కేంద్రం ద్వారా సాధించేందుకు చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. కంది బోర్డు మనకు మంజూరైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో కంది విస్తీర్ణం పెంచి దేశంలోనే కంది పంటకు పేరున్న తాండూరు ప్రాంత రైతులకు అండగా ఉంటామన్నారు. తన పదవీ కాలంలో ప్రజలకు ఈ రెండు హామీలతో పాటు సీఎం కేసీఆర్ ఇచ్చిన మెడికల్ కళాశాల ఏర్పాటు హామీని తీరుస్తానన్నారు. ప్రతి 15 రోజులకు తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పర్యటించేందుకు చొరవ తీసుకుంటానని అన్నారు. ప్రజల కళలలు సాకారం చేసే విధంగా తాను నిరంతరం ప్రజాసేవకే పాటు పడతానన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...