ముమ్మరంగా వాహన తనిఖీలు


Mon,March 25, 2019 12:00 AM

తాండూరు రూరల్ : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆర్డీవో వేణుమాధవరావు, డీఎస్పీ రామచంద్రుడు ఆదివారం పోలింగ్ స్టేషన్లతోపాటు చెక్‌పోస్టులను సందర్శించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తెలంగాణ - కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కొత్లాపూర్ చెక్‌పోస్టును సందర్శించారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి ఆర్డీవో, డీఎస్పీలు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కర్ణాటక నుంచి అక్రమ రవాణా జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలని, క్షణ క్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున డబ్బు, మద్యం, ఇతర అక్రమాలు చోటు అవకాశాలు ఉంటాయని వారు హెచ్చరించారు. పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్, ఎన్నికల విధుల్లో ఉన్న ైఫ్లెయింగ్ స్కాడ్, ఇతర సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

వాహనాలను తనిఖీ చేసిన అధికారులు
ఆర్డీవో వేణుమాధవరావు, డీఎస్పీ రామచంద్రుడు చెక్‌పోస్టుల సమీపంలో తాండూరుకు వచ్చేపోయే వాహనాలను క్షుణంగా తనిఖీలు చేశారు.

పోలింగ్ స్టేషన్ల సందర్శన
అదేవిధంగా రూరల్‌లోని పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. మండలంలోని అంతారంలోని పోలింగ్ స్టేషన్ సందర్శించారు. అదేవిధంగా పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబరు 2 ను కూడా సందర్శించారు. ఆయా పోలింగ్ స్టేషన్లలో సౌకర్యాలు, పోలింగ్ రోజు ఆయా స్టేషన్లలో ఏమైనా ఇబ్బందులు తలెత్తె అవకాశాలున్నాయా? అనే కోణంలో పరిశీలించారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...