రెండేండ్లలో సాగునీరిస్తాం


Sun,March 24, 2019 12:15 AM

- బీడు భూములను బంగారం చేస్తాం
- జిల్లా ప్రజల కాళ్లను కృష్ణా నీళ్లతో కడిగే బాధ్యత కేసీఆర్ ప్రభుత్వానిదే
- రంజిత్‌రెడ్డి సీఎం కేసీఆర్ సైనికుడు
- దేశంలోనే నంబర్ వన్ సీఎం కేసీఆర్
- 71 ఏండ్లలో కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదు
- టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన పరిగి,తాండూరు నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఢిల్లీలో కీలకమైతే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా వస్తుందని, కేంద్రం కలిసొచ్చినా, కలిసిరాకపోయినా వందకు వంద శాతం రెండేండ్లలో పరిగి, వికారాబాద్, తాండూ రు నియోజకవర్గాల ప్రజల కాళ్లను కృష్ణా నీళ్లతో కడిగే బాధ్యత సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదేనని, దుర్బిక్షమైన ఈ ప్రాంతంలో సాగుకు యోగ్యం లేని బీడు భూములన్ని భవిష్యతులో బంగా రం కానున్నాయని టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్ భవన్‌లో తాండూరు, పరిగి నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో అనుకొని పరిస్థితుల్లో తాండూరు నియోజకవర్గంలో ఓడిపోవాల్సి వచ్చిందని, ఎక్కడ కోల్పయామో అక్కడే వెతుక్కోవాలంటారు, కాబట్టి టీఆర్‌ఎస్‌లో భారీ చేరికలను చూస్తుంటే పార్లమెంట్ ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గంలో 30 నుంచి 40 వేలకుపైగా మెజార్టీ తప్పక వస్తుందన్న విశ్వాసం కలుగుతుందన్నారు. పరిగి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో మంచి విజయం సాధించామని, పార్లమెంట్ ఎన్నికల్లో మరింత మెజా ర్టీ సాధించాల్సిన ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డిపై ఉందన్నారు.

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గురించి మాట్లాడుతూ ఎన్నికల ముందు విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీ మారారని, పార్టీలు మారడం సహజం కానీ జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమని అన డం సరైంది కాదని, జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమైతే 71 ఏండ్ల పాటు కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని ఏలినా, దేశ ప్రజలకు చేసిందేమీ లేదని చురకలాంటించారు. 55 ఏండ్లు కాం గ్రెస్, 12 ఏండ్లు బీజేపీ అధికారంలో ఉన్న ఇప్పటికీ దేశంలో కరెంట్ లేని, తాగునీరు లేని ఊళ్లు ఉన్నాయన్నారు. జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమన్న విశ్వేశ్వ రెడ్డిని ఉద్దేశిస్తూ...ఓ పిల్లగాడు చిన్నప్పటి నుంచి బడికి పోకుండా, గుట్కాలు తింటూ 16 ఏండ్లకే మద్యానికి బానిసై, దొంగతనాలకు అలవాటు పడి, తండ్రి ప్యాంట్‌లో నుంచి డబ్బులు దొంగతనం చేస్తుంటే ఏమిటని ప్రశ్నించి అడ్డొచ్చిన తల్లిని, తదనంతరం తండ్రిని చంపిన పిల్లాగాడిని అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టగా, తల్లిదండ్రులు లేనివాడ్ని సారు వదలిపెట్టండని అని అడిగిండంట పిల్లగాడు ఇదేవిధంగా ఉంది విశ్వేశ్వర్‌రెడ్డి పరిస్థితి ఎద్దేవా చేశారు.

దేశంలోనే 70 శాతానికిపైగా ప్రజలు ఆమోదిస్తున్న నంబర్ వన్ సీఎం కేసీఆర్ అని సర్వేలన్నీ చెబుతున్నాయన్నారు. ప్రజల ఆదరణ, దీవెనలతో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 90 స్థానాల్లో గెలుపొంది, రెండోసారి అధికారం చేపట్టామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ఓటేశారు, పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ-రాహుల్‌గాంధీ మధ్య పోరు ఉంటుందంటున్నారని, అయితే కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్‌గాంధీకి లాభం, బీజేపీ ఎంపీలు గెలుస్తే మోదీకి లాభమని, అయితే టీఆర్‌ఎస్ ఎంపీలను గెలిపిస్తే మాత్రం తెలంగాణ గడ్డకు న్యాయం జరుగుతుందన్నారు. 16 మంది ఎంపీలు ఢిల్లీలో ఉంటే అప్పుడు రాష్ర్టానికి అడిగినన్ని నిధులు వస్తాయని కేటీఆర్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు అషామాషీ ఎన్నికలు కావని, దేశ రాజకీయాలను మలుపుతిప్పే దిశగా జరుగుతున్న ఎన్నికలని, ప్రజలంతా విజ్ఞతతో ఓటేయాలని ప్రజలకు విన్నవించారు.

రాష్ట్రంలో బ్రహ్మాండంగా అభివృద్ధి...
- మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి
రాష్ట్రంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందని, పార్టీలో చేరికలతో మరింత బలోపేతం అవుతుందని మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువ అయ్యాయన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీఆర్‌ఎస్ పార్టీలో గెలిచి పార్టీ మారారని, ప్రజలు గమనిస్తున్నారని, అదేవిధంగా విశ్వేశ్వర్‌రెడ్డి బుద్ధి చెబుతారన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, మల్కాజిగిరి రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ గెలుస్తామని మహేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

రంజిత్‌రెడ్డి విజయం ఖాయం..
- ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి గెలుపు ఖాయమని పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలమంతా సమిష్టిగా పని చేసి రంజిత్‌రెడ్డిని గెలిపించుకుంటామన్నారు. పాలమూరు-రంగారెడ్ది ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి సాగునీరు తీసుకువస్తామన్నారు. అదేవిధంగా కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకువస్తామన్నారు.

కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు...
టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో జిల్లాలోని తాండూరు, పరిగి నియోజకవర్గాల నుం చి మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో కాం గ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తు న టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పరిగి నియోజకవర్గ నుంచి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మలిపెద్ది మేఘమాల-ప్రభాకర్‌గుప్తా దంపతులు, పూడూరు మండలంలోని సిరిగాయపల్లి, చింతల్‌పల్లి, చిట్టెంపల్లి సర్పంచ్‌లు కవిత, రాజవర్ధన్‌రెడ్డి, జయమ్మ, పరిగి మండలంలోని లక్ష్మీదేవిపల్లి, రాఘవాపూర్ సర్పంచ్‌లు రేణుక, జగన్, మాజీ ఎంపీటీసీ రాజేందర్‌రెడ్డితో పాటు 180 వాహనాల్లో తరలి వెళ్లి సుమారు 2 వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అదేవిధంగా తాండూరు నియోజకవర్గ నుంచి మాజీ డీసీసీబీ చైర్మన్ లకా్ష్మరెడ్డి, తాండూరు మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్‌గౌడ్, తాండూరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారా మహిపాల్‌రెడ్డి, తాండూర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ జితేందర్‌రెడ్డి, పెద్దేముల్ జడ్పీటీసీ స్వరూపమల్లేశ్, పెద్దేముల్ వైస్ ఎంపీపీ గోపాల్‌రెడ్డి, ఎంపీటీసీలు భాగ్యమ్మ, వీరేశం, గోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సయ్యగౌడ్, రుద్రారం సర్పంచ్ దివ్యారెడ్డి, కౌన్సిలర్ హరిగౌడ్, మాజీ కౌన్సిలర్లు ముజీబ్, మేరీతోపాటు తాం డూరు పట్టణ కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు షబ్బీర్, భీమలింగం, సాయిరెడ్డి, మహిపాల్‌రెడ్డి, చంద్రశేఖర్‌గౌడ్, సంగారెడ్డి, భగవాన్, సంతోష్ టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. సమావేశంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర వైద్యారోగ్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి గట్టు రామచంద్రరావు, టీఆర్‌ఎస్ యువనేత పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...