మరో రెండేండ్లల్లో కొడంగల్ సస్యశ్యామలం


Sun,March 24, 2019 12:01 AM

- 1 లక్ష 20వేల ఎకరాలకు సాగునీరు
- చెరువులను నీటితో నింపేందుకు సర్వే పూర్తి
- పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించుకుందాం..
- ఎంపీ అభ్యర్థి మన్యం శ్రీనివాస్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం
- ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

కొడంగల్, నమస్తే తెలంగాణ : మరో రెండేండ్లల్లో కొడంగల్ నియోజకవర్గం సస్యశ్యామలంగా తులతూగనుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక టీఆర్‌ఎస్ పార్టీ కార్యాయలంలో ఆదివారం నియోజకవర్గంలోని కోస్గి పట్టణం లో నిర్వహించే ఎంపీ ఎన్నికల సభ సమావేశం ఏర్పాట్లపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రెండేండ్లల్లో కొడంగల్ ప్రాంతం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పచ్చదనంతో నిండుకోనుందని, అందుకు సంబంధించి నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, కోస్గి, మద్దూర్ మండలాల్లోని చెరువుల్లో నీటిని నింపే ప్రక్రియపై సర్వే పూర్తి కాబడినట్లు ఆయన తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఈ మధ్య కాలంలోనే సీఎం కేసీఆర్ రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేయ డం జరిగిందని, 18 వేల కోట్ల మంజూరుతో పనులు యుద్ధ ప్రా తిపధికన కొనసాగుతున్నట్లు తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో కొడంగల్‌లోని 1 లక్ష 20వేల ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను ఒక్కోక్కటిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్ పథకం అమలులోకి రానున్నట్లు పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందని, మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుంచి టీఆర్‌ఎస్ పార్టీ తరఫున మన్యం శ్రీనివాస్‌రెడ్డి అభ్యర్థిని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో పాటు శుక్రవారం నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.

ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఎంత ఉత్సహంతో ప్రచారం నిర్వహించి భారీ మెజార్టీతో విజయం సాధించుకోవడం జరిగిందని, అదే ఉత్సహంతో ఎంపీ ఎన్నికల్లో నియోజకవర్గ నుంచి ఎంపీ అభ్యర్థికి 30 వేల మెజార్టీని అందించే లక్ష్యంతో ముం దుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎంపీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీయనుందని, కొడంగల్‌ను టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దత్తత తీసుకోవడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మమ్మరంగా కొనసాగుతాయని తెలిపారు. ఎన్నికల అనంతరం వచ్చే ఏప్రిల్ నుంచి అభివృద్ధి పనులు జోరందుకోనున్నట్లు ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపునకు ప్రతి తెలంగాణ బిడ్డ కృషి చేయాలని, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో ఏ విధంగా సుస్థిర పాలన కొనసాగుతుందో..

అదే విధంగా ఢిల్లీలో కీలక స్థానాన్ని పొంది మరింత అభివృద్ధికి తోడ్పడదామని కోరారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నియోజవకర్గ కోస్గి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గ కార్యకర్తల విసృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సమావేశానికి నూతనంగా ఎన్నుకోబడ్డ జిల్లా మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జి బండ ప్రకాశ్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థి విచ్చేస్తున్నట్లు తెలిపారు. కావున నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌లతో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని సూచించారు.

తోక ముడిచిన మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి..
మహబూబ్‌నగర్ జిల్లాలో పప్పులు ఉడికేలా లేవని గ్రహించిన మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మల్కాజిగిరికి వెళ్లినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకొంటానని ప్రగల్బాలు పలికిన ఆయన మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. .

ఎక్కడికి వెళ్లినా ఆయనకు ఓటమి తప్పదని, ప్రజలు టీఆర్‌ఎస్‌కు పూర్తి మద్దతు తెలిపి పట్టం కట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కొడంగల్, బొంరాస్‌పేట టీఆర్‌స్ పార్టీ మండల అధ్యక్షులు గోడల రాంరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీ ఏన్గుల భాస్కర్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కృష్ణ, సర్పంచ్‌లు ఫకిరప్ప, గుండప్పలతో పాటు మధసూదన్‌యాదవ్, కోట్ల మహిపాల్, సిద్దిలింగప్ప, మల్లయ్య, దత్తురెడ్డి, బాలరాజు, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...