ఎన్నికల నిర్వహణకు సహకరించాలి


Sat,March 23, 2019 11:56 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రజా ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ మస్రత్‌ఖానమ్‌ఆయేషా సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మస్రత్‌ఖానమ్‌ఆయేషా మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఈవీఎం, వీవీప్యాట్లు అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో మొదటి ర్యాండమైజేషన్ చేయడం జరిగిందని తెలిపారు.

జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈవీఎం, వీవీప్యాట్ల యూనిట్లను నాలుగు విభాగాలుగా విభజించి అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా బ్యాలెండ్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్ సమభాగాలుగా విభజించి అన్ని పార్టీల సమక్షంలో ర్యాండమైజేషన్ చేసి ఆ ప్రకారంగా ఆ మిషన్లపై ఉన్నా నంబర్ల లిస్టులను రాజకీయ పార్టీ ప్రతినిధులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గాలకు ఈవీఎంలను, వీవీప్యాట్లను పంపిణీ చేసిన పిదప అక్కడి రాజకీయ నాయకుల ప్రతినిధుల సమక్షంలో ఇదే క్రమ సంఖ్యలో కలిగిన ఈవీఎంలు, వీవీప్యాట్లు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. మిషన్ల నంబర్లను కూడా రాజకీయ నాయకుల ప్రతినిధులకు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. అన్ని పక్కాగా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేశారు. ఇక్కడ చూపించిన ఈవీఎంలు, వీవీప్యాట్ల నంబర్లనే అక్కడ కూడా చూపించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అరుణకుమారి, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సాయన్న, శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బందయ్య, శ్రీనివాస్, కిష్టయ్య, నర్సింహులు, బీజేపీ నాయకులు శంకర్, టీడీపీ రాజయ్య, ఎంఐఎం నాయకులు గుల్షాన్, హర్షద్‌అలీ, హేక్‌అబిద్, వైఎస్సార్‌సీపీ నాయకులు నర్సింహులు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...