సీ విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేయండి


Sat,March 23, 2019 11:49 PM

తాండూరు రూరల్: పార్లమెంట్ ఎన్నికలు పారదర్శంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన సీ విజిల్ యాప్‌లో అక్రమాలపై ఫిర్యాదు చేయాలని తాండూరు మండల తహసీల్దార్ దశరథ్ సూచించారు. శనివారం మండలం కరణ్‌కోట సీసీఐ టౌన్‌షిప్‌లో సీసీఐ ఉద్యోగులకు సీ విజిల్ యాప్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఓటు దుర్వినియోగం గాకుండా, ఎన్నికల్లో మంచి వ్యక్తులను ఎన్నుకోవాలంటే సీ విజిల్ యాప్‌ను సీసీఐ ఉద్యోగులందరూ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యావంతులు తలచుకుంటే ఎన్నికలు న్యాయబద్దంగా జరుగుతాయని సూచించారు. ఓటు వేసేందుకు మనందరం ఆలోచించాలని, ఓటు అమ్ముకోవద్దన్నారు. కొంతమంది మద్యానికి, డబ్బులకు ఓట్లను అమ్ముకుంటున్నారని, వాటి జోలికి పోవద్దన్నారు. రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోబపెట్టేందుకు డబ్బు, మద్యం పంపిణీ చేసేందుకు యత్నిస్తున్న సమయంలో సీ విజిల్ ద్వారా ఫోట్ ఆప్‌లోడ్ చేస్తే, వంద నిమిషాల్లో సమస్య పరిష్కరించేందుకు ఎన్నికల అధికారులు యత్నిస్తారని తెలిపారు. సీసీఐలోని ప్రతీ ఉద్యోగికి సీ విజిల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఎన్నికల్లో అక్రమాల నిరోధానికి సహకరించాలన్నారు. సీసీఐ జనరల్ మేనేజర్ పాండే మాట్లాడుతూ ఎన్నికల్లో మంచి వ్యక్తులను ఎన్నుకోవాలంటే ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. యువత, మహిళలు, ఉద్యోగులు కచ్చితంగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ కార్యదర్శులు, పలువురు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

యాలాల: మండల పరిధిలోని జుంటిపల్లి, అక్కంపల్లి, పగిడిపల్లి గ్రామాల్లో శనివారం ఈవీఎం, వీవీ ప్యాట్స్‌ల వినియోగంపై రెవెన్యూ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈవీఎంల్లో ఓటును ఎలా వేయాలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ ఆర్‌డీఓ వేణుమాధవరావు, తహసీల్దార్ మల్లేష్‌కుమార్, ఆర్‌ఐ వెంకటేశం, రెవెన్యూ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

పెద్దేముల్ : ఈవీఎంల వినియోగంపై ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నామని మండల ఆర్‌ఐ మహ్మద్ వహీదోద్దిన్ అన్నారు శనివారం రేగోండి గ్రామంలో ఈవీఎం, వీవీ ప్యాట్లపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఈవీఎంలో ఓటు వేసే విధానాన్ని ప్రజలకు చూపించారు. కార్యక్రమంలో రిసోర్స్‌పర్సన్ ఎం.రాములు, సర్పంచ్ హైదర్, బీఎల్‌వోలు, అంగన్‌వాడీ టీచర్‌లు పాల్గొన్నారు.

పెద్దేముల్‌లో వాహనాల తనిఖీ..
మండల పరిధిలో రాకపోకలు జరిపే అన్ని వాహనాలపైన నిఘా పెట్టాలని పెద్దేముల్ తహసీల్దార్ తులసీరాం సూచించారు. పెద్దేముల్ మండల కేంద్రంలోని బాబుజగ్జీవన్‌రామ్ విగ్రహం కూడలిలో వాహన తనిఖీలను తహసీల్దార్ పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో ఆయన మాట్లాడారు. చెక్‌పోస్టు మీదుగా రాకపోకలు జరిపే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, డబ్బు, మద్యం అక్రమ రవాణా జరగకుండా అప్రమత్తంగా ఉండి విధులను నిర్వహించాలని కోరారు.

నేడు సర్పంచుల సమావేశం
తాండూరు రూరల్ : ఈవీఎంలపై సర్పంచులకు అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహిస్తున్నట్లు తాండూరు తహసీల్దార్ దశరథ్ తెలిపారు. ఉదయం 11 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. నియోజకర్గంలోని తాండూరు, పెద్దేముల్, యాలాల ,బషీరాబాద్ మండలాలకు చెందిన సర్పంచులు హాజరుకావాలని ఆయన కోరారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...