దాహార్త్తి తీర్చిన మిషన్ భగీరథ


Sat,March 23, 2019 11:44 PM

- నాడు మండు వేసవిలో అల్లాడిన జనం
- నేడు భగీరథ నీటితో చల్లబడిన ప్రజలు
- మండలంలో 90 శాతం పనులు పూర్తి
- త్వరలో పూర్తి కానున్న మిషన్ పనులు

బంట్వారం : గతంలో చూసుకుంటే వేసవిలో ఏ గ్రామానికి వెళ్లిన నీటి యుద్ధాలే మొదలైయ్యేవి. వేసవి మొదలవగానే గ్రామ గ్రామాన, వీధి వీధిలో ఎండిన బోర్లు, బావులు దర్శనమిస్తూ, చుక్క బొట్టు దొరుకని పరిస్థితి ఉండేది. ప్రతి రోజూ గ్రామాల ప్రజలు వేకువ జామున 4 గంటల నుంచే వ్యవసాయ పొలాల బావుల వద్ద నీటి కోసం వయస్సుతో తారతమ్యం లేకుండా సాలు, సాలుగా లైన్‌లు కట్టేవారు. నాలుగేండ్ల క్రితం వేసవిలో నీటి కష్టాలను తట్టుకోని ప్రజ లు గ్రామాలను సైతం వదిలి వెళ్లిన సంఘటనలు ఉన్నా యి. ఎండ్ల బండ్లు, ఆటోల్లో డ్రమ్ముల్లో నీళ్లు నింపుకోని తె చ్చుకొనే పరిస్థితి ఉండేది. ప్రధానంగా ఉమ్మడి బంట్వారం మండలంలో రొంపల్లి, నాగ్వారం, నాగ్వారం తండా, మా లసోమారం, బార్వాద్, నాగ్‌సాన్‌పల్లి, నాగ్‌సాన్‌పల్లి తండాల్లో తీవ్రమైన నీటి కష్టాలు దర్శనమిచ్చాయి. గత పాలకుల హయాంలో ఎండకాలం ప్రారంభమైందంటే గ్రామాల్లోని మహిళలు కాలి కుండలతో ప్రదర్శనలు చేస్తూ రోడ్లపైకి వ చ్చి ధర్నాలు చేసిన సంఘటనలు ఉన్నాయి. నేడు రాష్ట్రం లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రావడం, మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టి అమలు చేయడం వల్ల మండు వేసవి నుంచి ప్రజలను చల్లబరిచినైట్లెంది. నీటి కష్టాల నుంచి ప్రజలకు మిషన్ భగీరథ విముక్తి కల్పించింది.

మిషన్ భగీరథతో తప్పిన కష్టాలు...రాష్ట్రంలో నీటి కష్టాల నుంచి ప్రజలను సంపూర్ణంగా, సమూలంగా శాశ్వత పరిష్కారం కల్పించాలని సీఎం కేసీఆర్ కంకణం కట్టుకొని పాలన చేశారు. నాలుగేండ్ల కాలం లో ఎంతటి ఆర్థిక కష్టానైనా ఎదుర్కోని ప్రజలకు నీటి కష్టాలను దూరం చేసేందుకు వేల కోట్ల నిధులను వెచ్చించి మి షన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేశారు. మండలంలో డిసెంబర్ నాటికి 50 శాతం పనులు పూర్తై గ్రామాల్లోకి మంచి నీటిని సరఫరా చేశారు. అందులో ప్రధానంగా రొంపల్లి, మంగ్రాస్‌పల్లి, నాగ్వారం, సల్బత్తాపూర్ తదితర గ్రామాల్లో నీటి సరఫరా పూర్తైంది. దీంతో ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏండ్ల తరబడి కష్టాలు పడితున్న మాకు మిషన్ భగీరథతో సమస్య పరిష్కారం అయి ందంటున్నారు. ప్రస్తుతం మండలంలో 90 శాతం పనులు పూర్తి అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ట్యాంకుల నిర్మాణానికి రూ.3.72 కోట్ల నిధులు...
మిషన్ భగీరథలో ఉమ్మడి మండలంలో 29 గ్రామాల్లో 8033 ఇండ్లకు గాను ఇంటింటికీ నీటి సరఫరాకు 83.81 కిలో మీటర్ల పైప్‌లైన్ వేసేందుకు రూ.62.48 లక్షలతో పను లు ప్రారంభించారు. గ్రామాల్లో 22 కొత్త ట్యాంకుల నిర్మాణానికి రూ 3.72 కోట్లపై నిధులను మంజూరు చేశారు. అందులో భాగంగా మద్వపూర్, సల్బత్తాపూర్, కొత్తపల్లి, మోత్కుపల్లి, బీరోల్, నాగ్‌సాన్‌పల్లి, బార్వాద్, రాంపూర్, ఎన్నారం, కంకణాళపల్లి, తొరుమామిడి ( రెండు ట్యాం కు), బొపునారం, నూరుళ్ళపూర్‌ల్లో 14 ట్యాంకుల నిర్మా ణం పూర్తి చేశారు. కాగా బంట్వారంలో రెండు ట్యాంకులు, రొంపల్లి, జిన్నారం, బార్వాద్‌తండాలో నిర్మాణం చివరి దశలో ఉన్నాయి. మాలసోమారం, ఎన్నారం, నాగ్వారం గ్రామాల్లో ఇంక నిర్మాణ పనులు పూర్తి కాలేదు. ట్యాంకుల నిర్మాణం పూర్తైన గ్రామాలు, పాత ట్యాంకుల నుంచి ఇప్పటికే నీటి సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా రూ.6.57 కోట్ల నిధులతో గ్రామాల్లో పైప్‌లైన్ నిర్మాణం చేపట్టారు. అందు లో భాగంగా కంకణాళపల్లి, మల్‌శెట్టిపల్లి తండా, నాగ్‌సాన్‌పల్లి తండా, మద్గుల్‌తండా, బార్వాద్‌తండా, కొత్తపల్లి, రొంపల్లి, నాగ్వారం, మద్వపూర్, బీరోల్, నూరుళ్ళపూర్, యాచారం గ్రామాల్లో ఇంటర్నల్ ఇంటింటికీ పైప్‌లైన్ నిర్మా ణం పూర్తి చేయడం జరిగింది. రాంపూర్, బంట్వారం, కరీంపూర్, బార్వాద్, బస్వపూర్, సుల్తాన్‌పూర్‌లో పైప్‌లైన్ నిర్మాణం కొనసాగుతుండగ, ఎన్కేపల్లి, మాలసోమారం, మోత్కుపల్లి, ఎన్నారం, తొరుమామిడి, బొపునారం గ్రా మాల్లో పైప్‌లైన్ పనులు ఇంక ప్రారంభించాల్సి ఉంది. అయితే పనులు ప్రారంభమైన గ్రామాల్లో త్వరలోనే పూర్తి చేసి నీటిని సరఫరా చేస్తామని సంబంధింత శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...