రంజిత్‌రెడ్డికి భారీ మెజార్టీ అందిద్దాం


Sat,March 23, 2019 11:42 PM

- ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ రూరల్ : ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో వికారాబాద్ నుంచి భారీ మెజార్టీ ఇచ్చి టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. శనివారం వికారాబాద్‌లోని ఆయన నివాసంలో మండల స ర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తల తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్ర జలకు వివరించి చైతన్యవంతులను చేసి భారీగా మెజార్టీనందించేందుకు కృషి చేయాలన్నారు. ఎం పీ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి టీఆర్‌ఎస్ తరఫున బరీ లో నిలిస్తున్న గడ్డం రంజిత్‌రెడ్డికి నియోజకవర్గం నుంచి 60 వేల మెజార్టీ అందించేందుకు అంద రూ కలిసి కట్టుగా పని చేయాలన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం మాత్రమే పని చేస్తుందన్నారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేసి టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించారన్నారు. గ్రామాల్లో ఎ లాంటి సమస్యలు ఉన్న వెంటనే పరిష్కార మా ర్గం చూడాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యా మౌలిక వసతుల కల్పన చైర్మన్ నాగేందర్‌గౌడ్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...