మొక్కల పెంపకంపై నిర్లక్ష్యం చేయొద్దు


Sat,March 23, 2019 11:34 PM

మర్పల్లి : నర్సరీలో పెంచుతున్న మొక్కల పెంపకంపై నిర్లక్ష్యం చే యరాదని ఎంపీడీవో నాగలక్ష్మి సిబ్బందిని ఆదేశించారు. శనివా రం మండల పరిధిలో ని గణాపూర్, జంశట్‌పూర్, పట్లూర్ గ్రామా ల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హరితహారంలో భాగంగా జూలైలో మొ క్కల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రోజూ నర్సరీలను పర్యవేక్షించాలన్నారు. అధికారులు ఎవరై నా మొక్కల పెంపకంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉం టుందన్నారు. నర్సరీలో పండ్ల మొక్కలు పెంచడం జరుగుతుందన్నారు.
మొక్కల పరిశీలన
నవాబుపేట : వృక్ష సంపదను నిర్లక్ష్యం చే యడంతో మానవుని మనుగడ ప్రశ్నార్థకం గా మారుతుందని స ర్పంచ్ రత్నం పేర్కొన్నారు. శనివారం మ ండల పరిధిలోని గేటువనంపల్లి గ్రామంలో నర్సరీని సందర్శించి మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీలో ప్రస్తుతం 70 వేల మొక్కలు పెరుగుతున్నాయని తెలిపారు. నర్సరీలో ఆయా రకాల మొక్కలు పెంచుతున్నారని రానున్న వర్షాకాలంలో నాటడానికి సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో ప్రజల భాగస్వామ్యంతోనే కార్యక్రమం విజయవంతమవుతుందని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ లక్ష్యానికి తోడ్పాటు నందించాలని ఆయన కోరారు.
26న తెలంగాణ సీనియర్

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...