టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు


Fri,March 22, 2019 11:48 PM

కొడంగల్, నమస్తే తెలంగాణ : ప్లామెంట్ ఎన్నికలను పురస్కరించుకొని టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ స్థానాలకు మహబూబ్‌నగర్ నుంచి అభ్యర్థి యన్నే శ్రీనివాస్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ అభ్యర్థి పీ. రాములు శుక్రవారం మహబూబ్‌నగర్ కలెక్టర్ కార్యాలయంలో నామినేన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి హాజరైయ్యారు. ఎంపీ అభ్యర్థికి మద్దతు తెలుపుతూ ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్‌ఎస్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడులా పనిచేసి విజయాన్ని సాధించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ అమల చేస్తున్న అద్భుత సంక్షేమ పథకాలు ప్రజల మనస్సులను దోచుకున్నాయని, గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలను ఖంగు తినిపిస్తూ.. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు విజయఢంగా మ్రెగించడం జరిగిందన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో 16కు 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచించిన ప్రజా సంక్షేమం కోసమేననే భావన ప్రజల్లో పూర్తిగా ఏర్పడిందని, అభివృద్ధిని ఏజెండాగా టీఆర్‌ఎస్ పార్టీ ముందుకు సాగుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు మధుసూదన్‌యాదవ్ పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...