నీటిని పొదుపు చేసి భవిష్యత్ తరాలకు అందించాలి


Fri,March 22, 2019 11:48 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : ప్రతి ఒక్కరూ నీటిని పొదుపు చేసి భవిష్యత్ తరాలకు భూ గర్భ జలాలను పెంపొందించి నీటినందించాలని పాఠశాల ప్రిన్సిపాల్ పద్మ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని వైష్ణవి పాఠశాలలో జాతీయ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని నీటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి నిత్యం నీరులేనిదే మానవుని జీవనం సాగదని తెలిపారు. నీటిని విచ్చల విడిగా వాడి వృథా చేయవద్దని సూచించారు. భూ గర్భ జలాలను పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. నీటి వనరులను నిలువ చేసుకోవడం, వాడుకొనే పద్ధతులను తెలుసుకోవాలన్నారు. నీరు ఒక మంచి దివ్య ఔషధ గుణంగా భావించాలన్నారు. వేసవి కాలంలో శరీరంలో నీటి శాతం తగ్గి వడదెబ్బ వచ్చే అవకాశం ఉన్నందునా నీటిని బాగా తాగాలన్నారు. విద్యార్థులకు శక్తినిచ్చే కొబ్బరినీళ్లు, తైదంబలి, స్వీకరించాలన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ వర్క్ ఇన్‌స్పెక్టర్ పాండు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సక్రమంగా వాడుకోవాలి
వికారాబాద్ రూరల్ : ప్రతి ఒక్కరూ నీటిని పొదుపు చేసి భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సర్పంచ్ మమత అన్నారు. మండల పరిధిలోని బురాన్‌పల్లి గ్రామంలో అంతర్జాతీయ నీటి దినోత్సవం ఘనం చేపట్టారు. అనంతరం గ్రామంలో ప్రజలకు నీటి పొదుపుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైందన్నారు. మనం వినియోగించిన తర్వాత నీటిని వృథా చేయ్యకుండా మొక్కలకు మళ్లీంచాలన్నారు. అనంతరం మొక్కలకు నీరు పోశారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు

వృథా చేయొద్దు
కోట్‌పల్లి : వేసవి కాలంలో ప్రతి నీటి బొట్టుకు కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందని, నీటి వృథా చేస్తే ముందు తరాలకు తప్పదు కన్నీరని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విశ్వంపంతులు అన్నారు. మండల పరిధిలోని అన్నాసాగర్, మోత్కుపల్లి, కొత్తపల్లి తదితర గ్రామాల్లో జాతీయ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలకు నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి తమవంతు బాధ్యతగా మొక్కలకు నీరు అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకుని భావితరాలకు బాసటగా నిలువాలన్నారు. కార్యక్రమంలో కోట్‌పల్లి పీల్డ్ అసిస్టెంట్ బీమయ్య, అన్నాసాగర్ సర్పంచ్ రాధాకృష్ణ, ఆయా గ్రామాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గ్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...