కూలీలు అన్ని వసతులు కల్పించుకోవాలి


Fri,March 22, 2019 11:44 PM

మోమిన్‌పేట : ఉపాధి హామీ కూలీలు పని చేసే ప్రదేశంలోనే అన్ని వసతులు కల్పించుకోవాలని సర్పంచ్ జగదీశ్ అన్నారు. మండల పరిధిలోని రాంనాథ్‌గుడుపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు ఏపీవోతో కలిసి పలు సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పని చేసే ప్రదేశంలో కూలీలకు అందుబాటులో తాగునీరు, టెంట్, ప్రాథమ చికిత్స కిట్లను తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. అనంతరం గ్రామంలోని పాఠశాల ఆవరణలో జాతీయ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలకు నీరు పోశారు. కార్యక్రమంలో ఏపీవో శంకరయ్య, ఉపాధి కూలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ పొదుపు చేయ్యాలి
ధారూరు : ప్రతి ఒక్కరూ నీటిని పొదుపు చేయ్యాలని ఎంపీడీవో సబిత అన్నారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మొక్కలకు నీరు పోశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయా గ్రామాల్లో సంబంధిత అధికారులు, సర్పంచ్‌లు మొక్కలకు నీరు పోసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైందని దానిని వృథా చేసుకోవద్దని తెలిపారు.

ఇట్టి కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దేవ్య, ధారూరు సర్పంచ్ చంద్రమౌళి, ఎపీవో సురేశ్, ఉపాధ్యాయులు, పీల్డ్ అసిస్టెంట్లు తదిత రులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...