అక్రమంగా మద్యం అమ్మితే కఠిన చర్యలు


Fri,March 22, 2019 11:34 PM

- ఎక్సైజ్ సీఐ జిలానిబేగం
వికారాబాద్, నమస్తే తెలంగాణ : గ్రామాల్లో , తండాల్లో అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపిన, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వికారాబాద్ ఎక్సైజ్ సీఐ జిలానిబేగం హెచ్చరించారు. శుక్రవారం వికారాబాద్ ఎక్సైజ్ అధికారులు వికారాబాద్, పూడూరు మండలాల్లో తిర్మలాపూర్, రాకంచర్ల, లాల్‌సింగ్ తండాలలో ముమ్మర తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ మాట్లాడుతూ అక్రమ మద్యం అమ్మకాలు జరిపిన, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ఎన్నికల్లో భాగంగా ఎక్సైజ్ చట్టాలు చాలా కఠినంగా పనిచేస్తాయని ఎవరు కూడా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడ వద్దని కోరారు.అక్రమ అమ్మకాలు జరుపవద్దని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ ఎస్సైలు సిబ్బంది తదితరులు ఉన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...