గ్రామదేవతకు ఘనంగా బోనాలు


Fri,March 22, 2019 11:30 PM

వికారాబాద్ రూరల్ : గ్రామదేవత పోచమ్మ తల్లికి బోనాలు చేశారు. శుక్రవారం వికారాబాద్ మండలంలోని కోటాలగూడ గ్రామంలో గ్రామస్తులు పోచమ్మకు నేవేధ్యం సమర్పించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి బోనాలు సిద్ధం చేసుకొని.. ఊరేగింపుగా ఆలయానికి ఆలయానికి తరలివచ్చారు.గ్రామానికి చెందిన ఆడపడుచులూ తమ ఆత్తగారింటి నుంచి పండుగకు వచ్చారు. ఉద్యోగ నిమిత్తం వెళ్లిన వారు సైతం గ్రామ దేవతకు బోనాలను సమర్పించారు. పోతరాజుల విన్యాసాలు.. డప్పు సప్పులతో మారుమ్రోగింది. డప్పు వాయిద్యాల నడుమ బోనాలు ఎత్తుకోని మహిళలు ప్రదర్శనగా ముందుకు సాగారు. కార్యక్రమంలో సర్పంచ్ రాములునాయక్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బోనాల పండుగకు ఇతర గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. గ్రామంలో ఉన్న ప్రతి దేవాలయాలను అభివృద్ది చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...