కార్పొరేట్‌కు దీటుగా సర్కారు వైద్యం


Fri,March 22, 2019 04:21 AM

-ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వసతుల కల్పన
-వికారాబాద్, తాండూరులలో డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు
-అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ పథకాలతో ప్రభుత్వ దవాఖానల్లో పెరిగిన ప్రసవాల సంఖ్య
-జిల్లాలో 3 ప్రభుత్వ ఆస్పత్రులు, 22 పీహెచ్‌సీలు

వికారాబాద్, నమస్తే తెలంగాణ: గ్రామీణ ప్రజలకు విద్యా,వైద్య రంగాల్లో అత్యున్నత సేవలు అందించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది. పేదలకు ఈ రంగాల్లో సేవలు అందించినప్పుడే వారు మరింత అభివృద్ధి సాధిస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్వసిస్తున్నారు. గ్రామీణులకు కార్పొరేట్ స్థాయిల్లో వైద్యసేవలు అందించాలనే సంకల్పంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించారు. గత ప్రభుత్వాల హయంలో సర్కార్ దవాఖానకు వెళ్లాలంటే ప్రజలు జంకే వారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అను నానుడి నిజం చేసే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అందుకు భిన్నంగా సర్కార్ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి హంగులతో సౌకర్యాలను కల్పించడంతో ప్రజావైద్యానికి పెద్దసంఖ్యలో గ్రామీణులు ఆసక్తి చూపుతున్నారు. సౌకర్యాలతో వసతులను కల్పించి మెరుగైన వైద్య సేవలు దిస్తున్నారు.ప్రభుత్వాసుపత్రులలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో మహానగరాలకు వెళ్లి డయాలసిస్ చేసుకొని లక్షల రూపాయలు అప్పుల పాలయ్యే వారికి బాసటగా నిలిచేలా..ఆర్థిక భారం తగ్గించేలా 2018 జనవరి 26న వికారాబాద్, తాండూరులలో డయాలసిస్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఇప్పటి వరకు ఈ కేంద్రాల్లో 4,235 మంది రోగులకు డయాలసిస్ నిర్వహించారు. వీరు నగరానికి వెళ్లి నెలకు రూ.50 వేల వరకు ఖర్చు చేసుకొని డయాలసిస్ చేసుకునేవారు. ఇక్కడ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రుణపడి ఉంటామని దవాఖానకు వచ్చేవారు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో చిన్నారుల కోసం వైద్య నిపుణులను నియమించడంతో చక్కని వైద్యసేవలు అందిస్తున్నారు. దవాఖానల చిన్న పిల్లల డాక్టర్ల వద్ద చూపించుకుంటే రూ. వెయ్యి బిల్లు అయ్యేది. ప్రభుత్వాసుపత్రులలో చిన్నపిల్లల వైద్యనిపుణులు నియమించడంతో మెరుగైన వైద్య సేవలు అంది ఆర్థిక భారం పడకుండా నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతుంది. గైనకాలజిస్టులు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, ప్రసుతి, కంటి, డెంటల్ డాక్టర్లు అందుబాటులో ఉంచి గ్రామీణ ప్రజలకు చక్కటి మెరుగైన సేవలందించి వారి ఆరోగ్యానికి ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగైన సే అందించడం జరుగుతుంది.

అంతే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రులలోని రోగులు బయటకు వెళ్లి పరీక్షలకు చేయించుకోకుండా ఆసుపత్రులలోనే పరీక్షలు నిర్వహించుకునేందుకు ల్యాబ్‌ను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అంతే కాకుండా ఈసీజీ, ఎక్స్‌రేలు తీసి ప్రజలకు ఎలాంటి ఆర్థిక భారం పడకుండా సేవలందించడం జరుగుతుంది. ఈ పరీక్షలకు బయటకు వెళ్తే ప్రైవేటు ల్యాబ్‌ల వారు ఒక్కొ పరీక్ష పేరుతో ప్రజల నుంచి వేల రూపాయలను తీసుకోవడం జరుగుతుంది. సర్కార్ దవాఖానల్లో చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా సేవలు అందిస్తుడడంతో పాటు.. ప్రత్యేకంగా చిన్నపిల్లల వైద్యులను నియమించారు. చిన్న పిల్లల వైద్యం కోసం ప్రైవేటు దవాఖానలకు వెళ్లి డాక్టర్ల వద్ద చూపించుకుంటే వేలాది రూపాయల బిల్లు అయ్యేది. సర్కార్ దవాఖానలో ప్రత్యేక వైద్యులు అందుబాటులో ఉండడంతో ఉచితంగానే చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అంది.. ఆర్థిక భారం పడకుండా నిరుపేదలకు మేలు జరుగుతుంది.

గైనకాలజిస్టులు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, ప్రసూతి, కంటి, డెంటల్ డాక్టర్లు అందుబాటులో ఉంచి గ్రామీణ ప్రజలకు అన్ని విభాగాల్లో చక్కటి సేవలందించి వారి ఆరోగ్యానికి ప్రభుత్వ దవాఖానలు ముందుంటున్నాయి. సర్కార్ దవాఖానల్లో రోగులు బయటకు వెళ్లి పరీక్షలకు చేయించుకోకుండా ఆక్కడే పరీక్షలు నిర్వహించుకునేందుకు ల్యాబ్‌ను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు రోగులకు అవసరమైన ఈసీజీ, ఎక్స్‌రేలు తీసి ప్రజలకు ఎలాంటి ఆర్థిక భారం పడకుండా సేవలను అందిస్తున్నారు. పరీక్షలకు బయటకు వెళ్తే ప్రైవేటు ల్యాబ్‌ల వారు ఒక్కొ పరీక్ష పేరుతో ప్రజల నుంచి వేలాది రూపాయలను తీసుకోవడం జరుగుతుంది.

నెలకు 200 ప్రసవాలు..
సర్కార్ దవాఖానకు గతంలో ప్రసవాలంటే గ్రామీణ ప్రజలు వచ్చే వారు కాదు. ఆర్థిక భారమైన ప్రైవేటు దవాఖానల్లోనే ప్రసవాలు చేయించుకునే వారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని దవాఖానల్లో సౌకర్యాలు పెంచి కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకున్నారు. గతంలో ఆసుపత్రుల్లో డాక్టర్లు ఉండని పరిస్థితి నెలకొని ఉండేది. ప్రస్తుతం అన్ని విభాగాల్లో వైద్యులను నియమించి సేవలు అందిస్నున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ వైపు గ్రామీణులకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయాలు కల్పిస్తూ చర్యలు తీసుకోవడమే కాకుండా ముఖ్యమంత్రి సహాయనిధితో ఎంతో మంది అభాగ్యులకు వైద్య ఖర్చుల నిమిత్తం డబ్బులు చెల్లించి వారి కుటుంబాల్లో మనోధైర్యం నింపడం జరుగుతుంది. కేసీఆర్ కిట్‌తో దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా దవాఖానల్లో ప్రసవాలు చేయించి పాప పుడితే రూ.13వేలు, బాబు పుడితే రూ.12వేలు ప్రోత్సాహకం అందజేస్తున్నారు. దీనికి తోడు కేసీఆర్ కిట్‌లో తల్లికి చీరలు, బిడ్డకు పౌడర్, నూనె, సబ్బులు తదితర వస్తువులతో పాటు 18 రకాల కిట్టును అందజేస్తున్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...