కలెక్టరేట్‌లో ఎన్నికల ముగ్గులు


Fri,March 22, 2019 12:45 AM

సంగారెడ్డి చౌరస్తా: కలెక్టరేట్‌లో ముగ్గులు విరిసాయి. హోలీ పండుగ రోజు మహిళా ఉద్యోగులు వేసిన రంగవళ్లులు చూడ ముచ్చటగా కన్పించాయి. లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకొని స్వీప్ కార్యక్రమంలో భాగంగా గురువారం కలెక్టరేట్‌లోని ఏ బ్లాక్‌లో మహిళా ఉద్యోగులు రంగవళ్లులు వేశారు. సంప్రదాయ దుస్తుల్లో కుటుంబ సమేతంగా హాజరయిన మహిళామణులు ఓటు ప్రాధాన్యతను వివరిస్తూ ముగ్గు వేశారు. మధ్యం, డబ్బుకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ముగ్గుల ద్వారా సందేశమిచ్చారు. ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని సూచించారు. ఈ వేడుకలకు అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరై రంగవళ్లులను పరిశీలించారు. మహిళలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళా ఉద్యోగులు ఒకరికొకరు రంగులు చల్చుకొని హోలీ వేడుకలు జరుపుకున్నారు. పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ మోతి, ఆయా శాఖల అధికారులు, మహిళా ఉద్యోగులు, చిన్నారులు పాల్గొన్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...