వసంత వేళ.. హోలీ కేళీ


Fri,March 22, 2019 12:22 AM

తాండూరు టౌన్: హోలీ వేడుకలు తాండూరు పట్టణంలో ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కుటుంబాల సమేతంగా వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. యువతీ, యువకులు, గృహిణిలు కేరింతలతో ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. మార్వాడీ యువమంచ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి కుటుంబ సభ్యులతో బాలాజీ మందిర్‌లో ప్రత్యేక పూజలు చేసి హోలీ వేడుకలు నిర్వహించారు.
తాండూరు రూరల్: మండల పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం హోలీ వేడుకలను ఘనంగా జరిపారు. కరణ్‌కోట, మల్కాపూర్, ఓగిపూర్, బెల్కటూర్, గౌతాపూర్, చెంగోల్, కొత్లాపూర్, అల్లాపూర్, బిజ్వార్ తదితర గ్రామాల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ వేడుకలు ఆనందోత్సావాల నడుమ నిర్వహించారు. యువత, మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. బిజ్వార్ గ్రామంలో ఉట్టి కొట్టే కార్యక్రమంలో యువతసంతోషంగా పాల్గొన్నారు.
యాలాల: మండల పరిధిలో హోలీ వేడుకలు ఘనంగా జరిపారు. వసంత వేళ హోలీ వేడుకలు ప్రజల్లో ఆనందోత్సవాలు నింపాయి. యాలాల ,జుంటిపల్లి, కోకట్, పేర్కంపల్లి, అగ్గనూర్, ముద్దాయిపేట పగిడియాల తదితర గ్రామాల్లో హోలీ వేడుకల్లో యువకులు, మహిళలు సందడి చేశారు. మండల కేంద్రములో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సిద్రాల శ్రీనివాస్, పేర్కంపల్లిలో ఎంపీపీ సాయన్న గౌడ్, ఆయాగ్రామాల సర్పంచ్‌ల ఆధ్వర్యంలో హోలీ పండుగ నిర్వహించారు.
బషీరాబాద్: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో నిర్వహించిన హోలీ వేడుకల్లో యువకులు, చిన్నారులు సందడి చేశారు. విభిన్న రంగులు చేతబూని.. గ్రామంలో తిరుగుతూ ఒకరిపై ఒకరు చల్లుకొవడం కనిపించింది. మహిళాలు నీటి బిందెల్లో రంగులు కలిపి.. ఉత్సాహంగా చల్లుకుంటూ వేడుకల్లో సందడి చేశారు.
పెద్దేముల్ : మండలంలోని గ్రామాలలో హోలీ వేడుకలు ఘనంగా జరిపారు. గ్రామాల్లో బుధవారం రాత్రి కాముడి దహనం చేశారు. గురువారం యువతీ, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున్న పాల్గొని సంబురాల్లో సందడి చేశారు.ప్రజల్లో చైతన్యం నింపిన కళాజాత
బషీరాబాద్: కోత్లాపూర్ గ్రామస్తులకు సామాజిక అంశాలపై జనజాగృతి కళాబృందం అవగాహన కల్పించారు. జాతీయ కళారత్న అవార్డు గ్రహీత సలీం ఆధ్వర్యంలో కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలు, మద్యపాన, వరకట్న నిషేధం, యువత సన్మార్గంలో నడవడం, సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండడం వంటి అంశాలపై నృత్య గేయాలతో గ్రామస్తుల్లో చైతన్యం నింపారు. పర్యావరణంపై గ్రామస్తులను జాగృత్తం చేశారు. కాలుష్యాన్ని నియంత్రించక పోతే భవిష్యత్ తరాలకు మనుగడ కష్టమని ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. కళాజాత బృందాన్ని గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్, బిచ్చిరెడ్డి, కిరణ్, మారుతి, సర్దార్, జగదీష్, ఆంజిలయ్యగౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

దర్గా స్థలాన్ని పరిరక్షించాలి
మణికొండ, మార్చి 21 (నమస్తే తెలంగాణ): చారిత్రాత్మక హజ్రత్ దర్గా భూములను అన్యక్రాంతం కాకుండా రెవెన్యూ అధికారులు సర్వేలు చేపట్టి పరిరక్షించాలని మండల ఎంఐఎం అధ్యక్షుడు సయ్యద్ ముక్తార్‌పాషా అన్నారు. గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని దర్గాఖలీజ్‌ఖాన్ గ్రామంలోని హజ్రత్ దుర్వేష్ మొయినుద్దీన్ అమన్ అవులియా అల్ మారూఫ్ హజ్రత్ సయ్యిదనా గందం షా దర్గాకు చెందిన 3ఎకరాల 28 గుంటల భూమిని కొంతమంది వ్యక్తులు కబ్జాలు చేసేందుకు యత్నిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం రాజేంద్రనగర్ ఎంఐఎం ఇన్‌చార్జి రహమత్ బేగ్‌తో కలిసి దర్గా స్థలాన్ని పరిశీలించారు. వారు మాట్లాడుతూ చారిత్రాత్మక దర్గాకు చెందిన భూములను పరిరక్షించేందుకు రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...