25న హెల్త్ క్యాంపులు


Fri,March 22, 2019 12:22 AM

అహ్మద్‌నగర్ : అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ గురువారం నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలు ఈ నెల 25 న నిర్వహించేందుకు పీహెచ్‌సీల వైద్యాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2017 నవంబర్‌లో నాటి జిల్లా కలెక్టర్ యోగితా రాణా ప్రారంభించిన ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన రావడంతో ఇటీవల ప్రభుత్వం స్పెషలిస్ట్ డాక్టర్‌లతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. గురువారం హోలీ పండుగ రావడంతో అన్ని పీహెచ్‌సీలు బస్తీలలో నిర్వహించే ఔట్ రీచ్ క్యాంపులను వాయిదా వేశాయి. పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ఎంజీ నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో, ఈ నెల 25 న ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ ఎం.పావని, డాక్టర్ అర్చన తెలిపారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...