జై కిసాన్


Wed,March 20, 2019 11:51 PM

- రైతుబంధుతో అన్నదాతల్లో పెరిగిన ధైర్యం
- బీమాతో రైతు కుటుంబాలకు ధీమా
- రూ.5వేలకు పెట్టుబడి సాయం పెంపు
- మొదటి విడుతలో రూ.220కోట్లు పంపిణీ
- రెండో విడుతలో రూ.209కోట్లు పంపిణీ
- 228 మంది రైతులకు రైతుబీమా వర్తింపు
- రైతుల ముఖాల్లో చిరునవ్వులు

పరిగి, నమస్తే తెలంగాణ: వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతన్నలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన సీఎం కేసీఆర్ రైతులకు కోసం తీసుకొచ్చి రైతుబంధు పథకంతో ఇప్పడు రైతాంగంలో మనోధైర్యం నింపింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రైతు సంక్షేమం పేరిట వాగ్ధ్దానాలు చేయడం తప్పా ఆచరణలో చూపని గత పాలకులకు భిన్నంగా రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండాగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారు పనిచేస్తుంది. ఇందులో భాగంగా ముందుగా భూ రికార్డుల ప్రక్షాళన, అనంతరం రైతుబంధు ద్వారా గత మే 10వ తేదీ నుంచి రైతులకు రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాసు పుస్తకాలను తహసీల్దార్‌లు, డిప్యూటీ తహసీల్దార్‌లు, ఏఈవోలు, వీఆర్‌వోలతో కూడిన బృందాలను ఏర్పాటు చేసి ఎకరాకు రూ.4వేల చొప్పున చెక్కులు అందజేశారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా పరిధిలో మొదటి విడుతలో 2,25,215 మంది రైతులకు రైతుబంధు కింద రూ.244కోట్లు మంజూరు చేయబడ్డాయి. ఇందుకు సంబంధించి మొత్తం 2,28,715 చెక్కుల రూపంలో రైతుబంధు పంపిణీ చేపట్టడానికి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా మొదటి విడుతలో పట్టాదారు పాసు పుస్తకం ఉన్న రైతులకే రైతుబంధు చెక్కులు ఇచ్చారు. అప్పట్లో జిల్లా వ్యాప్తంగా 1,95,805 మంది రైతులకు 1,98,646 చెక్కుల రూపంలో రూ.220కోట్ల పంపిణీ చేశారు. రెండో విడుతలో అక్టోబర్‌లో జిల్లా వ్యాప్తంగా 1.46లక్షల మంది రైతులకు రూ.209కోట్లు అందించారు. ఇకపోతే ఈసారి పెంచిన పెట్టుబడి సాయం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి కూడా చెక్కుల రూపంలో పంపి ణీ చేస్తారా, బ్యాంకు ఖాతాలో జమ చేస్తారా తేలాల్సి ఉన్నది.

తప్పిన ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వేధింపులు
టీఆర్‌ఎస్ సర్కారు అమలు చేసిన రైతుబంధుతో రైతులు ప్రైవే టు వడ్డీ వ్యాపారుల చుట్టూ పెట్టుబడి సాయం కోసం తిరిగే బాధలు తప్పాయి. చిన్న సన్నకారు రైతులకే కాకుండా ఎంత భూమి ఉన్నప్పటికీ ఎకరాకు పంటకు రూ.4వేల చొప్పున అం
దించడతో ఆయా రైతుల భూ విస్తీర్ణం ఆధారంగా డబ్బులు అందజేశారు.

పెట్టుబడి సాయం రూ.10వేలకు పెంపు
రైతుబంధు కింద ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం రూ.10వేలకు పెంచింది. గత సంవత్సరం రెండు పంటలకు ఒక్కో ఎకరానికి రూ.8వేలు అందజేయగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ రైతుబంధు సాయాన్ని ఎకరానికి సంవత్సరానికి రూ.10వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.రాబోయే మే నెలలో అందజేసే పెట్టుబడి సాయం ఎకరాకు రూ.5వేల చొప్పున రైతాంగానికి అందజేయనున్నారు.

బీమాతో రైతుకు ధీమా
రైతుల కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం చనిపోయిన రైతు కుటుంబాలకు కొడంత అండగా నిలుస్తుంది. ఈ పథకం కింద జిల్లా పరిధిలో సుమారు 9లక్షల ఎకరాల భూమి ఉండగా అందులో సుమారు 7.60లక్షల ఎకరాలు సాగుభూమి ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లా పరిధిలో 2.66లక్షల మంది రైతులు ఉన్నారు. ఇందులోను బీమా సదుపాయం 18 నుంచి 59 సంవత్సరాల్లోపు వయసు వారికే వర్తిస్తుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా లక్షా 8వేల పైచిలుకు రైతులు 18 నుంచి 59 సంవత్సరాల్లోపు వయసు గల వారు ఉన్నారు. ఒక్కో రైతుకు వ్యక్తిగతంగా రూ.5లక్షలు బీమా సౌక ర్యం కల్పించారు. ఇందుకుగాను ప్రభుత్వం ఒక్కో రైతు పేరిట రూ.2,271 చొప్పున ప్రీమియం డబ్బులు ఎల్‌ఐసీకి ప్రతి సంవత్సరం చెల్లిస్తుంది.తద్వారా రైతులు ఒక్క రూపాయి చెల్లించకుండానే బీమా సదుపాయం పొందవచ్చు. రైతులు అనారోగ్యంతో మరణించినా, అకాల మరణమైనా ఈ బీమా వర్తిస్తుం ది. వ్యవసాయాధికారులు, రైతు సమన్వయ సమితుల సభ్యు లు ఇంటింటికీ తిరిగి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సేకరించి బీమా వర్తించేలా చూస్తున్నారు.

236 మంది రైతులకు రైతుబీమా వర్తింపు
2018 ఆగస్టులో ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా 236 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందారు. వీరిలో 228 మంది రైతు కుటుంబాలకు బీమా డబ్బులు రూ.5లక్షల చొప్పున అందాయి. రైతుబీమా చేసేటపుడు సంబంధిత రైతు సూచించిన నామినీకి సంబంధించిన బ్యాంకు ఖాతాలలో ఈ డబ్బులు జమ చేశారు.

ఐక్యరాజ్యసమితి మెచ్చిన పథకాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలు ఐక్యరాజ్య సమితి ద్వారా గుర్తింపు పొందాయి. తద్వారా రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభించిందని చెప్పవచ్చు.

దేశానికే మకుటాయమానంగా...
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలు భారత దేశానికే మకుటాయమానంగా నిలిచాయి. దేశంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు తీవ్ర కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ తాము అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా రైతుబంధు అమలు చేస్తామని ప్రకటించారు. ఇక తమకు తప్పదన్నట్లు ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరట పేరు మార్చి దేశవ్యాప్తంగా ఆ పథకాన్ని అమలు చేస్తుంది. ఇకపోతే దేశంలోని ఇతర రాష్ర్టాలు తెలంగాణ రాష్ట్రం అమలుచేస్తున్న రైతుబంధు పథకాన్ని పేరు మార్చి అమలు చేస్తున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరిట రైతులకు పెట్టుబడి సాయం అందించింది. దీంతోపాటు పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఇతర రాష్ర్టాలు సైతం ఈ పథకం అమలుకు ముందుకు వచ్చాయి.

అప్పులు లేకుండా పంట సాగు చేస్తున్నం
కేసీఆర్ సర్కార్ ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకం ద్వారా నేను లబ్ధిపొందాను. కేసీఆర్ పుణ్యమా అన్ని ఒక్క రూపాయి అప్పు లేకుండా నా రెండు ఎకరాల్లో పంటల ను సాగు చేస్తున్నాను రెండు విడుతల్లో రూ.16 వేలు రైతు బంధు పథకం కింద టీఆర్ ఎస్ సర్కార్ అందిచింది. గతంలో అప్పులు చేసి పంటలు సాగు చేస్తే నేడు అప్పులు లేకుండా పంటలు సాగు చేస్తున్నాం. రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
-రామచంద్రయ్య, రైతు మిట్టకోడూర్

వ్యవసాయంపై ఆసక్తి పెరిగింది
వ్యవసాయంపై ఆసక్తి పెరిగిం ది. గతంలో వేసిన పంటలు పండుతాయో లేదా అనే సం దేహం ఉండేది. పంట పం డించేందుకు ఇతరుల దగ్గర అప్పులు చేసి అప్పులు తీరు స్తామా లేదా అనే భయంతో పంటపై ఆసక్తి కనబర్చే వారం కాదు. నేడు సీఎం కేసీఆర్ రైతుల బాధలు తెలుసుకున్న వ్యక్తిగా రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి తమకు రైతు బాంధవునిలా వ్యవసాయం చేసేం దుకు పెట్టుబడి నిధిని అందిస్తున్నారు.
-విశ్వనాథం, రైతు ఇప్పాయిపల్లి

రూ.5లక్షలు బ్యాంకు ఖాతాలో జమయ్యాయి
మా నాన్న కాకి నర్సింలు గుండెపోటుతో గత నవంబర్‌లో మృతి చెందాడు. దీం తో వ్యవసాయ అధికారులు మా ఇంటికి వచ్చి విషయం తెలుసుకొని రైతుబీమా కింద రూ.5లక్షలను నా పేరిట గల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయించారు. ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా బీమా డబ్బులు అందాయి. వాటిని తమ కుటుంబ అవసరాల కోసం వాడుకుంటున్నాం. తమ కుటుంబం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటుంది.
- కాకి శ్రీనివాస్(మిట్టకోడూర్, పరిగి మండలం

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...