సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్


Wed,March 20, 2019 11:48 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ మస్రత్‌ఖానమ్‌ఆయేషా తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటుపై డీఆర్‌డీవో, ఉద్యానవన అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 128 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటిలో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసేందుకు ఆదేశించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో టీంల వారీగా పోలింగ్ కేంద్రాలను సందర్శించి రెండు, మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని సంబంధిత నోడల్ అధికారిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నాలుగు నియోజకవర్గాల్లోని ఏఈలతో ఆయా పోలింగ్ కేంద్రాలను సందర్శించి వెబ్‌కాస్టింగ్ పాయింట్లను గుర్తించి వాటికి కావాల్సిన ల్యాప్‌టాప్‌లను సమకూర్చుకోవాలని సూచించారు. సాంకేతిక సిబ్బందితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు. ఉద్యానవన శాఖ అధికారి నోడల్ అధికారిగా నియమించినందునా వెబ్‌కాస్టింగ్‌కు కావాల్సిన సామగ్రిని సమకూర్చుకోవాలని, డీఆర్‌డీఏ తరపున తగిన సహకారం అందించి గుర్తించిన అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయుటకు సమన్వయంతో పని చేయాలని అధికారులకు తెలియజేశారు. జిల్లా స్థాయిలో అధికారులు సాంకేతిక సిబ్బంది ల్యాప్ టాప్‌లను సమకూర్చుకొని వెబ్ కాస్టింగ్‌కు సహకరించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో డీఆర్‌డీవో జాన్సన్, ఉద్యానవన శాఖ అధికారి నీరజగాంధీ, సాంకేతిక సిబ్బంది తదితరులు ఉన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...