అభ్యర్థుల ప్రతి ఖర్చును లెక్కించాలి


Wed,March 20, 2019 11:47 PM

రంగారెడ్డి జిల్లా,నమస్తే తెలంగాణ: లోక్‌సభ ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రతి ఖర్చును లెక్కించాలని, రాత్రి వేళ్లలో చెక్ పోస్టుల వద్ద పటిష్టమైన నిఘా ఉంచాలని చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు వర్తకర్ ప్రసాద్ హన్మంత్‌రావు అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని చేవెళ్ల, వికారాబాద్,తాండూరు, పరిగి అసెంబ్లీ నియోజకవర్గల పరిధిలో ఎన్నికల వ్యయ పరిశీలన చేయనున్నట్లు తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల వ్యయాన్ని, అభ్యర్థుల ఖర్చుల వివరాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎక్కడైనా డబ్బు, మద్యం పంపిణీ జరిగిన్నట్లయితే వెంటనే పిర్యాదు చేయాలని, పార్లమెంట్‌ఎన్నికల అభ్యర్థులు నామినేషన్ వేసే రోజు నుంచి ఖర్చుల వివరాలు పరిగణలోకి వస్తాయని, ప్రతి అభ్యర్థి ఖర్చుల పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని,పోటీ చేసే అభ్యర్థుల ప్రతి అంశాన్ని రికార్డు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అభ్యర్థుల ఖర్చులపై నిరంతర నిఘా ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో వాహనాలకు, సభలకు, ర్యాలీలకు, అడ్వటైజ్‌మెంట్,పెయిడ్ న్యూస్ సం బంధించి ప్రతిరోజు సంబంధిత ఖర్చుల వివరాలను నిర్దేశించిన రేట్ల ప్రకారం ప్రొఫార్మాలో అందజేయాలన్నారు. ఎన్నికలకు సంబంధించి ఎవరైనా ఎక్కడైనా నిబంధనలు అతిక్రమిస్తే వారి యొక్క వివరాలను రికార్డు చేసి సీ-విజిల్‌లో యాప్‌లోగాని, gp.observerchevella@gmail.com, లేదా 6309009216 ఫోన్ నంబర్‌కు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఉషారాణి, డీసీఓ అనిత, డీపీఆర్వో శాఖ ఉపసంచాకులు ఎన్.వెంకటేశ్వరావు,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ సమాచార ఇంజనీర్ నర్సింహ పాల్గొన్నారు.

22
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...