నూతన పద్ధతులతో అధిక లాభాలు


Wed,March 20, 2019 11:47 PM

వికారాబాద్ రూరల్ : రైతులు నూతన పద్ధతులు అవలంభించి అధిక లాభాలు పొందాలని జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఫ్రొపెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్వర్యంలో జిల్లా వ్యవసాయ సాంకేతిక సలహా కేంద్రం (ఎరువాక) జిల్లా స్థాయి సమన్వయ సలహా సంఘం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు కురిస్తే పంటలు అత్యధికం పండుతాయన్నారు. జిల్లాలో కొంత మొత్తంలో చెరువుల ద్వారా పంటలు పండిస్తారన్నారు. జిల్లా మొత్తంలో కంది సాగు అత్యధికంగా చేస్తుండగా రెండో స్థానంలో పత్తి ఉందన్నారు. ఈ సంవత్సరం 1.53 లక్షల హెక్టర్లు సాగు అయ్యిందన్నారు. ప్రతి రైతుకు వ్యవసాయం పై అవగహన ఉన్నప్పుడే అత్యధికంగా లాభాలు గడిస్తారన్నారు. పూడురు మండలంలో కత్తెర పురుగు వల్ల దిగుబడి తగ్గిందని, శాస్త్రవేత్తల సూచనలతో కత్తెర పురుగును రుపుమాపోచ్చని తెలిపారు. ప్రతి రైతులు రసం పీల్చు పురుగుతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చిందని, అత్యధికంగా మం దులు పిచ్చికారి చేయడంతో అదుపులోకి వచ్చిందన్నారు .

ధారూరు మండలంలో వరిలో కాండం తొలిచే పురుగు ,దోమ కాటు పంటకు వచ్చిందన్నారు. శాస్త్రవేత్తలు సరైన సమయంలోసూచనలు ఇచ్చారన్నారు. జిల్లాలో ఫ్రొపెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవపాయ విద్యాలయం ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ సాంకేతిక సలహా కేంద్రం ఏర్పాటు చేయ డం చాలా సంతోషమన్నారు రైతులకు పంటల సాగు పై శిక్షణ తరగతులు నిర్వహించడం సం తోషం అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యానవన అధికారి వైజయంతి మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా మామిడి తోటలు ఉన్నాయన్నారు. తీగ జాతి కూరగాయలలో వైరస్ అధికంగా సోకుతుందన్నారు. విత్తనల శుద్ధ్దిలో జాగ్రత్తలు చేపడితే వ్యాధులను నివారించ వచ్చన్నారు. ఆసోసియెట్ డైరెక్టర్ ఆఫ్ రిసేర్చ్ వేంకటరమణ మాట్లాడుతూ రైతులు ఎప్పుడు నష్టాల పాలు కాకుండా నూతన వంగడాలను ఎంచుకోవాలన్నారు. కంది పంట సాగు చేసే రైతులు మొక్కకు మొక్కకు మధ్య దూరం 3 ఫీట్లు , సాలులో ఐతే 6 ఫీట్ల దూరం ఉండేలా చూసుకోవాలన్నారు. రేగడి, మంచి పొలాలల్లో ఎకారానికి 1 కేజీ కందులు విత్తలన్నారు. జిల్లా రైతులకు పంటల విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్న పట్టణంలోని వికారాబాద్ డిపో ఎదురుగా ఉన్న వ్యవసాయ సాంకేతిక సలహా కేంద్రాని సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సైంటిస్ట్ సుధాకర్ రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ రమాదేవి , సైంటిస్ట్ ప్రవీణ్, సుధారాణి ,రైతులు పాల్గొన్నారు

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...