రూ19.5లక్షల నగదు సీజ్


Wed,March 20, 2019 11:47 PM

మోమిన్‌పేట : వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండల పరిధిలోని మేకవనంపల్లి గేటు సమీపంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు దగ్గర బుధవారం మోమిన్‌పేట సీఐ శ్రీనివాస్ వాహనాల తనిఖీ చేశారు. ఆ సమయంలో రూ.19,50,000 లక్షల నగదు పట్టుబడింది. డబ్బులకు సంబంధించి సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో పోలీసులు రెవెన్యూ అధికారులకు అప్పగించా రు. మోమిన్‌పేట తహసీల్దార్ సం ధ్య పత్రాలను పరిశీలించిన అనంతరం డబ్బులకు, వారు చూపించే పత్రాలకు లెక్క లు సరిపోకపోవడంతో డబ్బులను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఓ ప్రైవేటు సంస్థ ఏటీఎంలలో నగదు పెట్టేందుకు తరలిస్తున్నట్టు సమాచారం. డబ్బులకు సంబంధించి ఎలాంటి రక్షణ, వాటికి సంబంధించిన పత్రాలు కూడా సరిగ్గా లేకపోవడంతో సీజ్ చేసినట్లు ఆమె తెలిపారు.

గ్రామాల్లో బెల్టుషాపుల మూసివేత
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికలకోడ్ అమల్లో ఉన్నందున గ్రామాల్లో బెల్టుషాపులు నడువకుండ చర్యలు చేపట్టామని మండల ఎక్సైజ్ సీఐ శ్రీలత అన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ముందస్తుగా గ్రామాల్లో మద్యం నిల్వ ఉంచకుండ, అనుమానం వచ్చిన వ్యక్తులను ముందుగా బైడోవర్ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు మండలంలో 15 మందిని బైడోవర్ చేశామన్నారు. అక్రమ మంగా మద్యం, డబ్బు తరలించకుండ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.

గ్రామాల్లో ముమ్మర తనిఖీలు
వికారాబాద్, నమస్తే తెలంగాణ : అక్రమంగా మద్యం అమ్మిన, రవాణా చేసిన కఠిన చర్య లు తీసుకోవడం జరుగుతుందని వికారాబాద్ ఎక్సైజ్ ఎస్సై శ్రవణ్‌కుమార్ తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లాలోని మన్నెగూడ, బూరాంతపల్లితండా, గొంగుపల్లి తండాలో ము మ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉండడంతోఎక్సైజ్ చట్టం చాలా కఠినంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ తనిఖీలో ఎక్సైజ్ సిబ్బంది ఉన్నారు.

వికారాబాద్ టౌన్‌లో :
వికారాబాద్ టౌన్ : పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అక్రమంగా మద్యం, డబ్బు, బంగారం, విలువైన వస్తువులు రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ సీఐ సీతయ్య తెలిపారు. బుధవారం వికారాబాద్ పట్టణ శివారులో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సీతయ్య మాట్లాడు తూ సరైన ఆధారాలు లేకుండా మద్యం, డబ్బు, విలువైన వస్తువులు, బంగారం వంటివి తరలిస్తే సీజ్ చేయడం జరుగుతుందన్నారు.

అక్రమ మద్యం పట్టివేత
బషీరాబాద్: ఓ కిరాణం దుకాణంలో అక్రమంగా అమ్ముతున్న మద్యంను పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబందించిన వివరాలను ఎస్సై మహిపాల్‌రెడ్డి మంగళవారం వెల్లడించారు. మండల పరిధిలోని కొర్విచెడ్ గ్రామంలో ఓ దుకాణంలో అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు తెలిసి పట్టుకున్నామని తెలిపారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...