చేవెళ్లలో భారీ మెజార్టీ సాధించాలి


Tue,March 19, 2019 11:45 PM

మోమిన్‌పేట: పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థికి భారీ మెజార్టీ అందించాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. మంగళవారం మండల కేంద్రం లో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాజీ డీసీసీబీ చైర్మన్ నర్సింహులు గుప్త ఆధ్వర్యంలో పార్టీలో చేరిన నాయకులను అభినందించారు. బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్యమని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ల్లి ప్రచారం చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం అందించిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీ అందిస్తారని నమ్మకం ఉందన్నారు. గ్రామ గ్రామన ప్రచారం మొదలు పెట్టి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయో లేదా తెలుసుకోవాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ వచ్చే నెల నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దేశవ్యాప్తంగా కేసీఆర్ చేపడుతున్న పథకాలపై చర్చించుకుంటున్నారని అతి తక్కువ సమయంలో తెలంగాణను అభివృద్ధి వైపు బాటలు వేస్తూ ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నారన్నారు. ఆ నమ్మకంతోనే పార్టీల కతీతంగా ఆయన్ను నమ్ముతున్నారని కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని కార్యకర్తలకు సూచించారు. ఎంపీ ఎన్నికల తర్వాత దేశంలోనే పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చీమల్‌దరి సర్పంచ్ నర్సింహారెడ్డి, నాయకులు అజీజ్, ఖాదర్, వెంకన్న, రాఘవేందర్‌గౌడ్, అంజయ్య, మహిపాల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...