అభ్యర్థుల వ్యయంపై పటిష్ట నిఘా


Tue,March 19, 2019 11:45 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ: పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయంపై గట్టి నిఘా టీంను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ మస్రత్‌ఖానమ్‌ఆయేషా తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఎన్నికల వ్యయ పరిశీలకులు వర్థకర్ ప్రసాద్, హన్మంత్‌రావులతో కలిసి సర్వే లైన్స్ టీంలు,ైఫ్లెయింగ్ స్వాడ్స్, స్టాటిస్టిక్స్ సర్వే లైన్స్ బృందాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీడియో సర్వేలైన్స్ టీంలు చురుకుగా పని చేస్తూ ఎక్కడైన ర్యాలీలు, పబ్లిక్ సమావేశాలు నిర్వహిస్తే అక్కడ అయ్యే ఖర్చులను అభ్యర్థుల ఖాతాల్లో జమ చేస్తారని అన్నారు. అంతే కాకుండా ఆ సభకు నిర్వహించే వాహనాలను, చైర్‌లను, ప్రచార సామగ్రిని కూడా వీడియో చిత్రీకరణ చేసి అభ్యర్థి ఖర్చులో జమ చేయాలని తెలిపారు. అటువంటి కార్యక్రమాలను వెంటనే సీడీల రూపంలో ఆర్వోకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించకూడదని కలెక్టర్ సూచించారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు వర్థకర్ ప్రసాద్, హన్మంత్‌రావులు మాట్లాడుతూ ైఫ్లెయింగ్ స్వాడ్ బృందాలు డబ్బు, మద్యం సరఫరాపై సమాచారం అందితే వెంటనే ఎస్పీ కార్యాలయంలో ఆదాయపన్ను శాఖ అధికారికి సమాచారం అందించాలన్నారు.

రూ.50వేలకు మించి నగదు దొరికితే దీనికి సంబంధించి సరైన పత్రాలను ఆ వ్యక్తి తనిఖీ అధికారులకు చూపించాలన్నారు. స్టాటిస్టికల్ సర్వే టీంలు తనిఖీ కేంద్రాల్లో మూడు షిప్టుల వారీగా విధులు నిర్వహించాలన్నా రాత్రి వేళల్లో చెక్‌పోస్టు పాయింట్ల వద్ద గట్టి నిఘా పెట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఏదైన నగదు దొరికితే పంచనామ రిపోర్టు బీ6 ఫారమ్ జిల్లా స్థాయి కమిటీకి నివేదించాలని సూచించారు. ఎంసీఎంసీ కమిటీ ద్వారా వార్తాపత్రి కల్లో వస్తున్న పెయిడ్ న్యూస్‌ను సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను అదుపు చేసేందుకు కమిటీ వాటిని సరైన విధంగా లెక్కగట్టి అభ్యర్థి ఖాతాల్లో జమ చేసి రిటర్నింగ్ అధికారికి పంపాలన్నారు. రాజకీయ నాయకులు ఏవైన సందేహాలు ఉంటే సెల్ నెం. 6309009216 నంబర్‌ను సంప్రదించాలన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన ఎన్నికల వ్యయ పరిశీలకులు నర్సింహారెడ్డి, ఎన్నికల వ్యయ నోడల్ అధికారి రేవతి, జాయింట్ కలెక్టర్ అరుణకుమారి, నిఘా బృందాల సందేహాలను సమావేశంలో నివృత్తి చేశారు. ఈ సమావేశంలో ఆర్డీవో విశ్వనాథం, డీటీవో దశరథ్, ఎన్నికలకు ఏర్పాటు చేసిన వివిధ బృందాల అధికారులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...