తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ


Tue,March 19, 2019 11:44 PM

-పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు సీనియర్ నాయకుల ప్రకటన
- ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎంపీ కొండా ఒంటెద్దు పోకడల వల్లే
-పార్టీ వీడుతున్నట్లు వెల్లడి
-త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్న ట్లు ప్రకటన
తాండూరు, నమస్తే తెలంగాణ: పార్లమెంట్ ఎన్నికల సమయంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఉమ్మడి జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అయిన పి. లకా్ష్మరెడ్డితో పాటు తాండూరు పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్‌గౌడ్,తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారామహిపాల్‌రెడ్డి, తాండూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి నర్సయ్యగౌడ్ తదితరులతో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి తాము మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం తాండూరు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి గట్టి షాక్ తినిపించారు. కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహిస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వైఖరి కారణంగా గత శాసన సభా ఎన్నికల సమయంలో పార్టీ టికెట్లు ఇష్టారాజ్యంగా ఇచ్చి కాంగ్రెస్ ఓటమికి కారకులైనారని విమర్శించారు. సీనియర్లకు పార్టీ టికెట్లు ఇవ్వడంలో ఏ మాత్రం శ్రద్ధ చూపలేదన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ టికెట్లను డబ్బులకు అమ్ముకుని లాబపడ్డారని ఘాటుగా విమర్శించారు. జిల్లా విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి సభ్యత్వం లేని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి దుర్మార్గపు రాజకీయాలు నడుపుతున్నారని అన్నారు. తాండూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చిచ్చుపెట్టడం వల్లే ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు.

టీఆర్‌ఎస్ నుంచి ఎంపీ కొండా ఏకాకిగానే కాంగ్రెస్ పార్టీలోకి చేరారని గుర్తు చేశారు. ఆయన వెంట ఒక్క టీఆర్‌ఎస్ నాయకుడైనా కాంగ్రెస్ పార్టీలో చేరారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిల ఒంటెత్తు పోకడల వల్ల సీనియర్లుగా ఉన్న తమకు పార్టీలో గుర్తింపునివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే తాము పార్టీ వీడుతున్నట్లు వెల్లడించారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి తమ సత్తా ఏమిటో పార్లమెంట్ ఎన్నికల్లో చూపెడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సీనియర్ నాయకులకు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదన్నారు.తాండూరు నియోజకవర్గం అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. అందువల్లే తమ అనుచరులు, పార్టీ నాయకుల సూచనలతో తాండూరు నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా తాము కాంగ్రెస్‌కు రాజీనామా చేసి త్వరలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరతామని తెలిపారు. తాండూరు మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్‌గౌడ్ మాట్లాడుతుతూ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిల ఒటెద్దు పోకడల వల్లే పార్టీ మారుతున్నామన్నారు. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి రూ. వేల కోట్ల నిధులు ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చారని అన్నారు. భవిష్యత్‌లో కూడా నియోజకవర్గంలో అభివృద్ధి కాంక్షించే తాము టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు.

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన నాయకులు వీరే..
తాండూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మాజీ డీసీసీబీ చైర్మన్ లకా్ష్మరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్‌గౌడ్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నారామహిపాల్‌రెడ్డి, కౌన్సిలర్ సరిత హరిహరగౌడ్, పెద్దేముల్ మండల జడ్పీటీసీ స్వరూప, మండల పార్టీ నాయకులు మల్లేశం ఉప్పరి, బషీరాబాద్ మండలం గొటుక కుర్ధు నాయకులు సురేశ్, తాండూరు మండల నాయకులు నర్సయ్యగౌడ్, తాండూ రు పట్టణ నాయకులు మాజీ కౌన్సిలర్ మేరి, ముజీబ్, సాయిపూర్ సాయిరెడ్డి, సాయిపూర్ మేస్త్రీ నర్సింహులు, కె.నర్సింహారెడ్డి, చెన్‌గేశ్‌పూర్‌కు చెందిన ప్రశాంత్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, మల్కాపూర్ వెంకటేశం గౌడ్, కుర్వ నర్సింహులు, బాల్‌రాజ్‌గౌడ్, అబ్బాస్, చెంగోల్ వే ణుగోపాల్ గౌడ్, కాశప్ప. అంజిలయ్య, చెన్నారెడ్డి, జగన్నాథ్‌రెడ్డి, ప్రదీప్‌గౌడ్ ఉన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...