16 ఎంపీ స్థానాలు గెలిచిఢిల్లీని శాసిద్దాం..


Tue,March 19, 2019 12:28 AM

-కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
-కాంగ్రెస్ నాయకులు చిల్లర విమర్శలు మానుకోవాలి
-రాష్ర్టాలు బాగుపడితేనే దేశాభివృద్ధి సాధ్యం
-తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
-కేటీఆర్ సమక్షంలో వికారాబాద్‌కు చెందిన
-2000వేల మంది పలు పార్టీల నాయకులు చేరిక
వికారాబాద్, నమస్తే తెలంగాణ: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 16 ఎంపీ స్థానాలను భారీ మెజార్టీతో విజయం సాధించి ఢిల్లీ రాజకీయాలను శాసిద్దామని టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ అన్నారు. సోమవారం హైద్రాబాద్‌లోని టీఆర్‌ఎస్‌భవన్‌లో వికారాబాద్ నియోజక వర్గం నాయకులు ఎమ్మెల్యే ఆనంద్ ఆధ్వర్యంలో 2000 మంది కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఇతర పార్టీల నుంచి వచ్చి టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రెండు ఎంపీ స్థానాలున్నప్పుడే ఢిల్లీ రాజకీయాల్లో తనదైన శైలిలో వత్తిడి తెచ్చి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని అన్నారు. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలదే హవా కొనసాగుతుందని, కేంద్రంలో ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలకు అవకాశం లేదని పేర్కొన్నారు. తెలంగాణలో 16 ఎంపీలు స్థానాలు గెలిచి మరో 116 ఎంపీలతో జత కట్టి ఫెడరల్ ఫ్రంట్‌తో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి దేశరాజకీయాల్లో కేసీఆర్ తనదైన పాత్రను పోశిస్తారని అన్నారు. రాష్ర్టాలు బాగుపడితేనే దేశం అభివృద్ధి సాధిస్తుందన్నారు.

సీఎం కేసీఆర్ అనేక మంది ఉద్యమ కారులకు పార్టీలో సముచిత స్థానం కల్పించారన్నారు.55 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ నాయకులు ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతో ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పునాధులు కదులుతున్నది విశ్లేషణ చేసుకోకుండా చిల్లర విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. ఏప్రిల్ 11న జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రె, బీజేపీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రధాని మోడీ తెలంగాణకు జాతీయ ప్రాజెక్టుల్లో స్థానం కల్పించకుండా తీరని అన్యాయం చేశాడన్నారు. తెలంగాణకు న్యాయం జరుగాలంటే మన 16 ఎంపీ స్థానాలను గెలిపించుకోవాలన్నారు.తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను దేశంలో పలు రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటుందన్నారు.

కార్యక్రమంలో మంత్రులు చామకూర మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్,మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి,విద్యామౌలిక వసతుల కల్పన చైర్మన్ నాగేందర్‌గౌడ్,రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ అనంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు
మోమిన్ పేట్ మండలం నుంచి పార్టీలో చేరినవారు
మాజీ డీసీఎంస్ చైర్మన్ నర్సింలు గుప్త, మాజీ మండలాధ్యక్షుడు శివకుమార్,మాజీ జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు నర్సింహారెడ్డి, బాల్‌రెడ్డిగూడ సర్పంచ్ చంద్రయ్య, టేకులపల్లి సర్పంచ్ విష్ణు వర్ధన్‌రెడ్డి, సైదులాపూర్ సర్పంచ్ సత్యనారాయణ, ఎన్కతల పీఏసీఎస్ మాజీచైర్మన్ బక్కారెడ్డి, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి, టేకులపల్లి మాజీ వాటర్ షెడ్ చైర్మన్ సయ్యద్ కాదర్, గుడుపల్లి సర్పంచ్ జగదీశ్వర్, కాంగ్రెస్ నాయకులు ప్రతాప్ రెడ్డి, ఆనందం, బీజేపీ మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డి తదిరులు చేరారు.

ధారూర్ మండలం నుంచి..
పీఏసీఎఎస్ చైర్మన్ హన్మంత్ రెడ్డి, రాజేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, బల్వంత్, రాంచందర్, దోర్నాల్ సర్పంచ్ సుజాత, మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి, రాంచందర్, వరద మల్లికార్జున్, ప్రశాంత్, వీరేందర్ రెడ్డి, రాంచందర్‌గౌడ్, రామకృష్నారెడ్డి,దస్తగిరి తదితరులు చేరారు.
వికారాబాద్ టౌన్ నుంచి..
వికారాబాద్ కాంగ్రెస్ కౌన్సిలరు లక్ష్మీకాంత్ రెడ్డి, బుచ్చిబాబు గౌడ్, డా.భక్తవత్సలం, డా. పురుషోత్తం, డా.సాంబమూర్తి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్, రంగరాజు, లక్ష్మణ్‌రావు, శ్యాంరెడ్డి, గిరీశ్‌కొఠారి, రమేశ్, లక్ష్మణ్, గురుపంతులు, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు లక్ష్మణ్, సత్యనారాయణ, మక్బుల్ తదితరులు చేరారు.

వికారాబాద్, బంట్వారం, మర్పల్లి మండలాల నుంచి...
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయన్న, వెంకటేశ్వర్,అగమయ్య, ఖాజాతదితరలు, తొరుమామిడి సర్పంచ్‌స్ఫూర్తి, రొంపల్లి సర్పంచ్ ఉమాదేవమ్మ,మైలార్‌దేవరంపల్లి సర్పంచ్ తిరుపతిరెడ్డి, సిద్దులూర్ సర్పంచ్ అంజయ్య తదితరలు టీఆర్‌ఎస్‌లో చేరారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...