మొదటి రోజు నామినేషన్లు నిల్


Tue,March 19, 2019 12:23 AM

- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ లోకేశ్‌కుమార్
- నామినేషన్ కేంద్రం వద్ద కేంద్ర బలగాల పర్యవేక్షణలో నిఘా
రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైంది. సోమవారం జిల్లాలోని రాజేంద్రనగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని చేవెళ్ల, తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు నామినేషన్ పత్రాలు తీసుకువెళ్లారు. మొదటి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడంతో ఎలాంటి హడావుడి కనిపించలేదు.. మొదటి రోజు నామినేషన్ దాఖలు చేయలేదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ లోకేశ్‌కుమార్ వెల్లడించారు. నామినేషన్ కేంద్రం వద్ద కేంద్ర బలగాల పర్యవేక్షణలో నిఘా కొనసాగింది. సీసీ కెమెరాల పహారాలో నామినేషన్ కేంద్రాన్ని అధికారులు పర్యవేక్షించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హరీశ్, డీఆర్వో ఉషారాణి, ఇతర శాఖల అధికారులున్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...