స్వతంత్ర అభ్యర్థులకు 36 గుర్తులు కేటాయింపు


Tue,March 19, 2019 12:22 AM

రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభించినప్పటికీ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఈ నెల 25న నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ నెల 9న ఎన్నికల సంఘం స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే 36 గుర్తులు, రాజకీయ పార్టీల 44 గుర్తులను విడుదల చేసింది. నామినేషన్లు ముగిసిన అనంతరం వరుస పద్ధతిలో అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. ఆపిల్, గన్నా కిసాన్, హెలికాప్టర్, బూర ఊదుతున్న మనిషి, బ్రెడ్ టోస్టర్, సీసీటీవీ కెమెరా, కంప్యూటర్, కంప్యూటర్ మౌస్, డోర్ హ్యాండిల్, చెవి రింగులు, ఫుట్‌బాల్, అల్లం, లేడీ పర్సు, తోపుడు బండి, హవర్ గ్లాసు, పనసపండు, కేతిరి, ఫుట్‌బాల్ ఆటగాడు, కిచెన్ సింక్, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, టీవీ రిమోట్, రోబో, రబ్బర్‌స్టాంపు, పడవ, సితార్, షట్టర్, సోపా, స్పానర్, వికెట్లు(స్టంప్స్), స్విచ్ బోర్డు, జావెలిన్‌త్రో విసురుతున్న వ్యక్తి, ట్యూబ్‌లైట్, వాటర్‌ట్యాంక్, వెదురు చాట (విన్నోవర్), నోటా గుర్తును చివరగా ఏర్పాటు చేసి అభ్యర్థులకు కేటాయించనున్నారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత మిగిలిన అభ్యర్థులు తమకు కావాల్సిన గుర్తులను రిటర్నింగ్ అధికారికి సూచించాల్సి ఉంటుంది.

ఎలాంటి అభ్యంతరాలు, పోటీ లేకుంటే ఆయా గుర్తులను అభ్యర్థులకు కేటాయిస్తారు. సాధారణంగా ఎన్నికలంటే పార్టీ గుర్తులు ప్రాచుర్యంలోకి వస్తాయి. స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలబడితే స్వచ్ఛందంగానే ఎన్నికల సంఘం గుర్తులు కేటాయిస్తుంది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అందుబాటులోకి తీసుకువచ్చిన ఎన్నికల గుర్తులు ఆసక్తి కల్గిస్తున్నాయి. అభ్యర్థులకు కేటాయించబోతున్న గుర్తులన్నీ సగటు మనిషి జీవనశైలికి అద్దంపడుతున్నాయి. నిజ జీవితంలో నిత్యం మనం వాడే వస్తువులు, తినే పండ్లు, క్రీడా వస్తువులు, అలంకరణగా ధరించే నగలు, ఇతరత్రా ఎన్నికల సంఘం ప్రత్యేకంగా గుర్తించింది. ఇవే ఇప్పుడు పార్లమెంట్‌లో పోరులో కీలకం కానున్నాయి. అభ్యర్థుల గెలుపోటములనూ ఈ గుర్తులే తలకిందులు చేయడానికి నిర్ణయించబోతున్నాయి.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...