ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలి


Fri,February 22, 2019 11:16 PM

తాండూరు రూరల్ : నిరుద్యోగ యువత అవకాశాలను అందిపుచ్చుకొని, సద్వినియోగం చేసుకోవాలని, ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని జిల్లా రూరల్ ఎస్పీ అన్నపూర్ణ అన్నారు. శుక్రవారం తాండూరులోని భవానీ ఫంక్షన్ హాల్‌లో రూరల్ పోలీసు, కైరోస్ కాంపోజిట్ సర్వీసెస్స్ ట్రైనింగ్ ఆకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్మీ సెలక్షన్ కోసం దేహదారుఢ్య పరీక్షల నిర్వహించిన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ గతంలో పోలీసుల ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని, పోలీసు సెలక్షన్ కోసం గతంలో 600 మందికి శిక్షణ ఇప్పించామని, అదేవిధంగా రక్తదాన శిబిరాలతోపాటు ఇతర సేవా కార్యక్రమాలు కూడా చేయించామన్నారు. యువత వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.. వేణుమాదరావు మాట్లాడుతూ యువత దేశ చేసే యువత ఆర్మీలో చేరేందుకు భారీగా తరలిరావడం అభినందనీయమన్నారు. యువత క్రమశిక్షణతో ఉంటే ఏదైనా సాధిస్తారన్నారు. పోలీసు, ఆర్మీ ఉద్యోగం సంపాధించాలంటే ఫిజికల్ ఫిట్‌నెస్స్ ముఖ్యమని తెలిపారు.

డీఎస్పీ రామచంద్రుడు మాట్లాడుతూ ఉచిత ఆర్మీ సెలక్షన్‌కు విశేష స్పందన రావడం అభినందనీయమన్నారు. వికారాబాద్ జిల్లానేగాకుండా మహబూబ్‌నగర్, హైదరాబాద్, మెదక్, ఆదిలాబాద్‌తోపాటు ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో యువత తరలిరావడం హర్షనీయమన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ భోగేశ్వర్‌రావు మాట్లాడుతూ యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. జీవీకే ప్రతినిధులు రావు, మూర్తీలు మాట్లాడుతూ ఆసక్తిగల యువతీ, యువకులకు ఆర్మీ సెలక్షన్ కోసం ఉచిత కోచింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తిగల యువతీ, యువకులు జనరల్ కేటగిరీలో 17 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరిలో 17 సంత్సరాల నుంచి 26 సంవత్సరాలు, ఎస్సీ,ఎస్టీ కేటగిరిలో 17 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వయస్సు గల వారు దరఖాస్తు చేసుకొవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ ఉపేందర్, టౌన్ సీఐ ప్రతాపలింగం, ఎస్సైలు సంతోశ్, మహిపాల్‌రెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అమర జవాన్లకు రెండు నిమిషాలు మౌనం
పూల్వామాలో అమరులైన వీరజనాన్లకు ఎస్పీ అన్నపూర్ణ, ఆర్డీవో వేణుమాధరావు, డీఎస్పీ రామచంద్రుడు, సీఐలు ఉపేందర్, ప్రతాపలింగంతోపాటు పోలీసు సిబ్బంది, శిక్షణ కోసం వచ్చిన యువతీ, యువకులు రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులర్పించారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...