మదాన్‌పల్లిలో ఎన్‌ఐఆర్‌డీ బృందం పర్యటన


Fri,February 22, 2019 11:16 PM

వికారాబాద్ రూరల్:దేశంలోనే అత్యధికంగా ప్రజలకు ఉపాధిని కల్పించే పథకమే మహాత్మగాంధీ జాతీయ ఉపాధి పథకమని ఎన్‌ఐఆర్‌డీ సిబ్బంది కో ఆర్డినేటర్ హారికారెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్ మండల పరిధిలోని మదాన్‌పల్లి గ్రామంలో మహాత్మ జా ఉపాధి హామీ పనుల ఎన్‌ఐఆర్ ఢిల్లీ బృందం, కు చెందిన పూరేల్లలు సందర్శించారు.గ్రామంలో జరుగుతున్న ఫాం పండ్ పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఎన్‌ఐఆర్‌డీ సిబ్బంది కో ఆర్డినేటర్ హారికారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పనిని కూలీలకు పనిని కల్పించేందుకు ప్రవేశ పెట్టరాన్నారు. వికారాబాద్ ఎంపీడీవో సూభాషిని, శ్రీనివాస్‌లు వివరిస్తూ గ్రామాలల్లో 90 శాతం ప్రజలు ఉపాధిహామీ కింద పని చేస్తు జీవనం సాగిస్తూ బ్రతుకుతారన్నారు.పని ప్రదేశంలో టెంట్లు,మెడికల్ కిట్స్ తప్పక పనికి వెంట తీసుకుపోతరాన్నారు.ఈ కార్యక్రమంలో ఆడిషనల్ పీడీ చెన్నకేశవులు దుర్గ ప్రసాద్,గ్రామ సర్పంచ్ రాజు,గ్రామ కార్యదర్శి వరలక్ష్మి,ఎన్‌ఐఆర్‌డీ కో ఆర్డినేటర్ అనితారెడ్డి, టీం ఎడ్ శ్రీనివాసాన్,యూకే కు చెందిన పూరిళ్ల,ఎన్‌ఐఆర్‌డీ సిబ్బంది, కూలీలు తదితరులు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...