కొనసాగుతున్న వెలుగు


Fri,February 22, 2019 11:16 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : జిల్లాలో జోరుగా కంటి వెలుగుతో గ్రామీణ ప్రజల జీవితాల్లో వెలుగులు విరజిల్లుతున్నాయి. నిరుపేదల ఇండ్లలో కంటి వెలుగు పథకం ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. గ్రామాల్లో ఇంటింటికి కంటి వెలుగుతో సరైన విధంగా కంటి కంటి పరీక్షలు అంది కంటి వెలుగుతో గ్రామీణ నిరుపేద ప్రజల కండ్లల్లో వెలుగులు వచ్చి చక్కటి జీవితాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు ధీర్ఘకాలికంగా వేదిస్తున్నటువంటి కంటి సమస్యలు కంటి వెలుగుతో తీరి, ఎంతో సంతోషంతో జీవనం సాగిస్తున్నారు. అనేక సంవత్సరాలుగా కంటి సమస్యలు ఉన్న హైదరాబాద్ లాంటి మహానగరాలకు వెళ్లి చూయించు కోలేని గ్రామీణ ప్రజలకు ఈ పథకం గొప్ప వరంలా మారింది. జిల్లాలో 22 క్యాంపులను ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు.జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 3,86,835 మంది కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో 54,284 మందికి కండ్లద్దాలు పంపిణీ చేయడం జరిగింది. వివిధ కంటి సమస్యలపై శస్త్రచికిత్సలు చేయించుకునేందుకు వివిధ ఆసుపత్రులకు 25,554 మందిని రెఫర్ చేయడం జరిగింది.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...