ఎంపీటీసీ స్ధానాలు కుదింపు


Fri,February 22, 2019 12:24 AM

- జిల్లాలో 224 ఎంపీటీసీ స్థానాలు
-11 ఎంపీటీసీ స్థానాలను కుదిస్తూ ముసాయిదా విడుదల
-జిల్లాలో పాత ఎంపీటీసీ స్థానాల సంఖ్య 235
-2011 జనాభా లెక్కల ప్రకారం మార్పులు, చేర్పులు
-నేటితో అభ్యంతరాల స్వీకరణ పూర్తి..
-రేపు అభ్యంతరాలపై విచారణ
-25న తుది జాబితాప్రచురణ
-మేలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు
స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఏప్రిల్‌లో పార్లమెంట్ ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో తదనంతరం మేలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే జిల్లా యంత్రాంగం జిల్లాలో కొత్త పంచాయతీలు ఏర్పాటైన దృష్ట్యా జిల్లావ్యాప్తంగా 224 ఎంపీటీసీ స్థానాలకు కుదిస్తూ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అయితే గతంలో జిల్లాలో 235 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 11 ఎంపీటీసీ స్థానాలను తగ్గిస్తూ ఈ ముసాయిదాను విడుదల చేశారు. అయితే ప్రధానంగా 3 వేల జనాభా నుంచి 4 వేల జనాభాకు ఒక ఎంపీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి మార్పులు, చేర్పులపై జిల్లా పరిషత్ అధికారులు, అభ్యంతరాల స్వీకరణకు నేటి వరకు గడువిచ్చారు. ఈ అభ్యంతరాలపై ఈనెల 23, 24 తేదీల్లో విచారణ చేపట్టనున్నారు. అనంతరం కొత్త ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఈనెల 25న తుది జాబితాను ప్రకటించనున్నారు.

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఏప్రిల్‌లో పార్లమెంట్ ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో తదనంతరం మే లోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ మేరకు జిల్లా యం త్రాంగం ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి కసరత్తు చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి మార్పులు, చేర్పుల పక్రియ కసరత్తు పూర్తి చేశారు. అయితే జిల్లాలో కొత్త పంచాయతీలు ఏర్పాటైన దృష్ట్యా ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి మార్పులు, చేర్పులకు సంబంధించి ఇప్పటికే ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా పరిషత్ అధికారులు, అభ్యంతరాల స్వీకరణకు నేటి వరకు గడువిచ్చారు. అదేవిధంగా ఈ నెల 23, 24 తేదీల్లో ఎంపీటీసీ స్థానాల మార్పులు, చేర్పులపై వచ్చే అభ్యంతరాలపై విచారణ చేపట్టనున్నారు. అదేవిధంగా జిల్లాలో కొత్త ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఈ నెల 25న తుది జాబితాను ప్రకటించనున్నారు. మరోవైపు గతంలో జిల్లావ్యాప్తంగా 17 జడ్పీటీసీ స్థానా లు ఉండగా ప్రస్తుతం కొత్తగా కోట్‌పల్లి మండలం ఏర్పాటైన నేపథ్యంలో కోట్‌పల్లి జడ్పీటీసీ స్థానాన్ని కొత్తగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు పూర్తి చేశారు.

జిల్లాలో 224 ఎంపీటీసీ స్థానాలకు కుదింపు...
జిల్లావ్యాప్తంగా 224 ఎంపీటీసీ స్థానాలకు కుదిస్తు జిల్లా య ంత్రాంగం ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అ యితే గతంలో జిల్లాలో 235 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 11 ఎంపీటీసీ స్థానాలను తగ్గిస్తూ జిల్లా యంత్రాంగం ముసాయిదాను విడుదల చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి మార్పులు, చేర్పులు ప్రక్రియ పూ ర్తి చేశారు. అయితే కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు కావడంతో కొన్ని గ్రామాలు పాత ఎంపీటీసీ స్థానంలో కలుపడం, మరికొన్ని కొత్త గ్రామ పంచాయతీలను కొత్త ఎంపీటీసీ స్థాన ంగా ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా 3 వేల జనాభా నుంచి 4 వేల జనాభాకు ఒక ఎంపీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఏ గ్రామ పంచాయతీలో అయితే అధిక జనాభా ఉంటు ందో సంబంధిత గ్రామం పేరిటనే ఎంపీటీసీ స్థా నాన్ని ఏర్పాటు చేస్తు ముసాయిదాను రూపొందించారు.

ఆయా ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి..
పూడూరు మండలంలో పాతవి 13 ఎంపీటీసీ స్థానాలుండగా 13 ఎంపీటీసీ స్థానాలకు ముసాయిదా విడుదల చేశారు, అయితే కొత్తపల్లి ఎంపీటీసీ స్థానాన్ని చీలాపూర్‌గా పేరు మా ర్చుతూ నిర్ణయించారు. అదేవిధంగా పరిగి మండలంలో 1 ఎంపీటీసీ స్థానాలుండగా కొత్తగా మున్సిపాలిటీ ఏర్పాటు కావడంతో ఎంపీటీసీల సంఖ్యను 13కు కుదించారు. దోమ మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలుండగా ప్రస్తుతం 14 ఎంపీటీసీ స్థానాలు, కులకచర్లలో 16 ఎంపీటీసీ స్థానాలుండగా 16 ఎంపీటీసీ స్థానాలు, బొంరాస్‌పేట్‌లో 16 ఎంపీటీసీ స్థానాలుండగా 15 ఎంపీటీసీ స్థానాలకు కుదిస్తు డ్రాఫ్ట్ రిలీజ్ చేశారు. అదేవిధంగా కొడంగల్ మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలుండగా 11 ఎంపీటీసీ స్థానాలకు, దౌల్తాబాద్‌లో 14 ఎంపీటీసీ స్థానాలుండగా ప్రస్తుతం 14 ఎంపీటీసీ స్థానాలు, వికారాబాద్‌లో 9 ఎంపీటీసీ స్థానాలుండగా ప్రస్తుతం 7 ఎంపీటీసీ స్థానాలకు కుదించారు. ధారూరు మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలుండగా ప్రస్తుతం 12 ఎంపీటీసీ స్థానాలు, మర్పల్లిలో 14 ఎంపీటీసీ స్థానాలుండగా ప్రస్తుతం 15 ఎంపీటీసీ స్థానాలకు, కోట్‌పల్లిలో 6 ఎంపీటీసీ స్థానాలుండగా 7 ఎంపీటీసీ స్థానాలకు, బం ట్వారంలో 5 ఎంపీటీసీ స్థానాలుండగా కొత్తగా 6 ఎంపీటీసీ స్థా నాలకు పెంచుతూ నిర్ణయించారు. నవాబుపేట్ మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలుండగా 12 ఎంపీటీసీ స్థానాలకు పెంచా రు, మోమిన్‌పేట్‌లో 12 ఎంపీటీసీ స్థానాలుండగా ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండా 12 ఎంపీటీసీ స్థానాలకు ముసాయిదాను విడుదల చేశారు.

తాండూరు మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలుండగా ఎ లాంటి మార్పులు, చేర్పులు లేకుండానే 15 ఎంపీటీసీ స్థానాలకు, యాలాలలో 13 ఎంపీటీసీ స్థానాలుండగా 13 ఎంపీటీసీ స్థానాలకు ముసాయిదాను ప్రకటించారు. పెద్దేముల్ మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలుండగా కొత్తగా 13 ఎంపీటీసీ స్థా నాలకు కుదిస్తూ, బషీరాబాద్‌లో 12 ఎంపీటీసీ స్థానాలుండగా 12 ఎంపీటీసీ స్థానాలకుగాను డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను జిల్లా య ంత్రాంగం ప్రకటించింది. సంబంధించి ఎంపీటీసీ స్థానాలపై ఏమైనా అభ్యంతరాలు వస్తే మార్పులు, చేర్పులు చేసే అవకాశముంది, లేదంటే 224 ఎంపీటీసీ స్థానాలను ఫైనల్ చేస్తు ఈ నెల 25న తుది జాబితాను ప్రచురించనున్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...