ఎంపీటీసీ స్థానాలకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల


Fri,February 22, 2019 12:18 AM

కులకచర్ల: ఎంపీటీసీ స్థానాలకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఎంపీడీవో తారిక్‌అన్వర్ విడుదల చేశారు. కులకచర్ల మండలంలో గతంలో 20 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. మండలం నుంచి 5 గ్రామ పంచాయతీలు మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ మండలంలో విలీనం చేయడంతో 4 ఎంపీటీసీలు నవాబ్‌పేట్‌లో కలిశాయి. ప్రస్తుతం కులకచర్ల మండలంలో 44 గ్రామ పంచాయతీలకు గాను 16 ఎంపీటీసీ స్థానాలను ఎంపిక చేసినట్లు ఎంపీడీవో తారిక్‌అన్వర్ తెలిపారు. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల ప్రకారం ఎంపీటీసీ స్థానాలను కేటాయించడం జరిగాయని అన్నారు. కేటాయించిన ఎంపీటీసీ స్థానాలపై అభ్యంతరాలు ఈ నెల 23 వరకు తెలుపుకోవచ్చునని అన్నారు. 2011 జనాభ లెక్కల ప్రకారం కులకచర్ల మండలంలో 44 గ్రామ పంచాయతీల్లో 5603 జనాభా ఉందని దీని ప్రకారం ఎంపీటీసీ స్థానాల కేటాయింపు జరిగిందని తెలిపారు. కుస్మసముద్రం ఎంపీటీసీ పరిధిలో కుస్మసముద్రం, చెరువుముందలితండా(కె), గోరిగడ్డతండా గ్రామ పంచాయతీలు(3432 మంది జనాభా), బజ్జ్యనాయక్ తండా(కొత్త ఎంపీటీసీ స్థానం)లో అడవి వెంకటాపూర్, బజ్జ్యనాయక్‌తండా, బొర్రహేమ్యతండా, గోగ్యనాయక్‌తండా గ్రామ పంచాయతీలు(2332 మంది జనాభా), అంతారం ఎంపీటీసీ స్థానంలో అంతారం, చెరువుముందలి తండా(ఎ), బిందెంగడ్డతండా(3274 మంది జనాభా), బండ ఎంపీటీసీ స్థానంలో బండ మంది జనాభా), చౌడాపూర్ ఎంపీటీసీ స్థానంలో చౌడాపూర్, విఠలాపూర్, ఈర్లవాగుతండా గ్రామ పంచాయతీలు(4397 మంది జనాభా), ఘనాపూర్ ఎంపీటీసీ స్థానానికి ఘనాపూర్, బొంరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలు(2690 మంది జానాభా), ఇప్పాయిపల్లి ఎంపీటీసీ స్థానానికి ఇప్పాయిపల్లి, రాంపూర్ గ్రామ పంచాయతీలు(3994 మంది జనాభా), కులకచర్ల ఎంపీటీసీ స్థానంకు పరిధిలో కులకచర్ల గ్రామ పంచాయతీ(5272 మంది జనాభా), కామునిపల్లి ఎంపీటీసీ స్థానంలో చాపలగూడెం, ఎత్తుకాల్వతండా, కామునిపల్లి గ్రామ పంచాయతీలు(2352 మంది జానాభా), మక్త ఎంపీటీసీ స్థానానికి మందిపాల్, మక్త వీరాపూర్ గ్రామ పంచాయతీలు(4552 మంది జానాభా), ముజాహిద్‌పూర్ ఎంపీటీసీ స్థానానికి ముజాహిద్‌పూర్ గ్రామ పంచాయతీ(27 మంది జనాభా), వాల్యనాయక్‌తండా ఎంపీటీసీ స్థానానికి పీరంపల్లి, బొట్యనాయక్‌తండా, లింగంపల్లి, వాల్యనాయక్‌తండా గ్రామ పంచాయతీలు(2994 మంది జనాభా), పటెల్‌చెరువుతండా ఎంపీటీసీ స్థానానికి రాంరెడ్డిపల్లి, దాస్యనాయక్‌తండా, పటెల్‌చెరువుతండా, అల్లాపూర్ గ్రామ పంచాయతీలు(3150 మంది జనాభా), పుట్టపహాడ్ ఎంపీటీసీ స్థానానికి పుట్టపహాడ్, అనంతసాగర్ గ్రామ పంచాయతీలు(3603 మంది జనాభా), తిర్మలాపూర్ ఎంపీటీసీ స్థానానికి తిర్మలాపూర్, బండమీదితండా, లాల్‌సింగ్‌తండా గ్రామ పంచాయతీలు(2445 మంది జనాభా), సాల్వీడ్ ఎంపీటీసీ స్థానానికి సాల్వీడ్, చెల్లాపూర్, రాంనగర్, ఎర్రగోవింద్‌తండా, హన్మ్యనాయక్‌తండా గ్రామ పంచాయతీలు(4367 మంది జనాభా) ఉన్నాయి. వీటిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23వరకు తెలియజేయవచ్చునని అన్నారు.

మండలంలో తగ్గిన రెండు ఎంపీటీసీ స్థానాలు
పెద్దేముల్ : మండల పరిధిలో సుమారు 2 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. పెద్దేముల్ మండల పరిధిలో గతంలో 15 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుతం ఎంపీటీసీ స్థానాల పునర్విభజన అనంతరం ఎంపీటీసీ స్థానాల సంఖ్య రెండు తగ్గి 13 స్థానాలకు చేరింది. మండలంలో నుండి కోట్‌పల్లి, ఇందోల్ గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడిన కోట్‌పల్లి మండల పరిధిలోనికి విలీనం చేయడంతో దీని ప్రభావం ఏకంగా మండలంలోని ఎంపీటీసీ స్థానాలపైన పడింది. అందువల్ల పెద్దేముల్ మండలంలో ఒకప్పుడు 15 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుతం 13 స్థానాల అయి రెండు స్థానాలు తగ్గాయి. కాగా పెద్దేముల్ మండల పరిధిలో పాత ఎంపీటీసీ స్థానాలు వరుసగా అడికిచెర్ల, ఓమ్లానాయక్‌తాండా, తట్టేపల్లి, నాగులపల్లి, గోపాల్‌పూర్, ఇందూర్, పెద్దేముల్, జనగాం, కోట్‌పల్లి, కొండాపూర్,గాజీపూర్, హన్మాపూర్, కందనెల్లి, మంబాపూర్, రేగొండిలు మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలు ఉండగా కోట్‌పల్లి మండల నూతన ఏర్పాటుతో రెండు స్థానాలు తగ్గగా మొత్తం 13 స్థానాలకు తగ్గింది. ఆ 13 స్థానాలు వరుసగా అడికిచెర్ల, పాషాపూర్, తట్టేపల్లి, నాగులపల్లి, రుద్రారం, ఇందూర్, పెద్దేముల్,మారేపల్లి, జనగాం,గాజీపూర్, కందనెల్లి, మంబాపూర్, కొండా ఉన్నాయి. అధికారులు నిన్న జారీ చేసిన ముసా ఎంపీటీసీ స్థానాల ప్రకారం వివిధ గ్రామాలు ఆయా ఎంపీటీసీ స్థానాల పరిధిలోనికి కేటాయించ
1. అడికిచెర్ల ఎంపీటీసీ స్థానం పరిధిలో (బాయిమీదితండా,ఊరెంటితండా, అడికిచెర్ల గ్రామాలు)
2. పాషాపూర్ పరిధిలోకి (పాషాపూర్, జయరాంతండా, ఓమ్లానాయక్‌తండా),3.తట్టేపల్లి పరిధిలోకి ( తట్టేపల్లి, బండమీదిపల్లి, సిద్దన్నమదుగుతండా),4. నాగులపల్లి పరిధిలోకి ( నాగులపల్లి, గోపాల్‌పూర్),5.రుద్రారం పరిధిలోకి ( రుద్రారం, ఎర్రగడ్డతండా, ఆత్కూర్)
6.ఇందూర్ పరిధిలోకి (ఇందూర్, జయ ం ండా ),7.పెద్దేముల్ ( పెద్దేముల్),.మారేపల్లి పరిధిలోకి (మారేపల్లి, బండపల్లి, మన్‌సాన్‌పల్లి,మారేపల్లి తాండా,దుగ్గాపూర్),9.జనగాం పరిధిలోకి ( జనగాం, ఖానాపూర్, బుద్దారం),10. గాజీపూర్ పరిధిలోకి ( గాజీపూర్, గొట్లపల్లి, హన్మాపూర్, గిర్మాపూర్ ),11. కందనెల్లి పరిధిలోకి ( కందనెల్లి, కందనెల్లి తండా),12.మంబాపూర్ పరిధిలోకి ( రుక్మాపూర్, మంబాపూర్),13. కొండాపూర్ పరిధిలోకి ( కొండాపూర్, రేగొండి, మదనంతాపూర్, చైతన్యనగర్ )
గ్రామాలు 13 ఎంపీటీసీ స్థానాల పరిధిలోకి వస్తాయని అధికారులు తెలిపారు.
ఇది వరకు ఉన్న ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఉన్న గ్రామాలకు ఇప్పుడున్న ఎంపిటిసి స్థానాల పరిధిలోని గ్రామాలకు వ్యత్యాసం ఉండి, మొత్తానికి పెద్దేముల్ మండల ఎంపీటీసీ స్థానాల సంఖ్య రెండు స్థానాలు తగ్గి 13 స్థానాలకు చేరిందని అధికారులు తెలిపారు...

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...