ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి


Wed,February 20, 2019 11:12 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : ఈ నెల 27 నుంచి మార్చి 15 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇం టర్మీడియట్ సెక్రటరీ ఎ.అశోక్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఇంటర్ బోర్డు అధికారులకు సూచించారు. బుధవా రం హైదరాబాద్‌లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ కా ర్యాలయం నుంచి అశోక్ జిల్లా ఇంటర్ బోర్డ్ అధికారులతో ఇంటర్ పరీక్షలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వికారాబాద్ కలెక్టరేట్ నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణకుమారి, ఎస్పీ అన్నపూర్ణ, ఇంటర్మీడియట్ కళాశాలల నోడల్ అధికారి, సిబ్బందితో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడునని తెలిపారు. 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని తెలియజేశారు. విద్యార్థులు హాల్ టికెట్స్‌ను tsbie వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.

హాల్ టికెట్ లేకుండా కేంద్రాలకు వచ్చే వారికి పరీక్షలు రాయుటకు అనుమతి ఉండాదన్నారు. కేంద్రంలోని విద్యార్థులు విధులు నిర్వహించే సిబ్బంది సెల్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగించరాదన్నారు. ఉదయం 8 గంటల నుంచి 8:45 గంటల వరకు కేంద్రంలోకి అనుమతించబడునని ఆయన తెలియజేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ అరుణకుమారి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 24 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందన్నారు. కళాశాలలతో పాటు చుట్ట్టూ పక్కల జిరాక్స్ సెంటర్లను పరీక్ష సమయంలో మూసి ఉంచాలని ఆదేశించడం జరిగిందని ఇంటర్ బోర్డు అధికారికి జేసీ తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం బస్సుల సౌకర్యం కల్పించడం జరుగుతుందని వివరించారు. కేంద్రాల్లో విద్యార్థులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లతో పాటు ప్రాథమిక చికిత్సను అందించుటకు వైద్య శాఖ ద్వారా అన్ని ఏర్పాట్లు చేయించడం జరిగిందని తెలియజేశారు. సమావేశంలో ఎస్పీ అన్నపూర్ణ, ఇంటర్‌బోర్డు నోడల్ అధికారి శంకర్‌నాయక్, డాక్ మెంబర్ సురేశ్వరస్వామి, నర్సింహారెడ్డి, ఇతర ఇంటర్ కళాశాలల సిబ్బంది పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...