చునావ్ పాఠశాలతో అవగాహన కల్పించాలి


Wed,February 20, 2019 11:11 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల కమిషనర్ ఆదేశా ల మేరకు చునావ్ పాఠశాలల కార్యక్రమాన్ని అన్ని మం డలాల్లో నిర్వహించాలని ప్రతి ఒక్కరికీ అవగాహన క ల్పించాలని జాయింట్ కలెక్టర్ అరుణకుమారి తెలిపా రు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో తహసీల్దార్లు, ఎంఈవోలతో ఈ నెల 20 నుంచి మండలాల్లోని బూత్ లేవల్ అధికారులతో చునావ్ పాఠశాలలను నిర్వహించేందుకుగాను ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణకుమారి మాట్లాడు తూ పాఠశాలలు, కళాశాలల్లో, కార్యాలయాల్లో సిబ్బందికి శిక్షణ, ఓటు వినియోగం వివిధ ప్యా ట్స్, బ్యాలెట్ యూని ట్ వినియోగంపై పూర్తి స్థాయి శిక్షణను ఇవ్వాలని తెలిపారు. ప్రతి ఓ టు హక్కు విలువైనదే , ఎవరూ కూడా ఓటు హక్కును వదులుకోవద్దని ఓటు దుర్వినియో గం చేయవద్దనే నినాదంతో మండలంలోకి వెళ్లి ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. బ్యాలెట్ యూనిట్స్, వీవీప్యాట్స్ పని చేయు విధానాన్ని క్లుణ్ణంగా తెలుపాలన్నారు.
సమావేశంలో డీఆర్‌వో మోతీలాల్, డీఆర్‌డీవో జా న్సన్, డీఈవో రేణుకాదేవి, తహసీల్దార్లు, ఎంఈవోలు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...