మున్సిపాలిటీల్లో.. అభివృద్ధి పరుగు


Tue,February 19, 2019 11:30 PM

- నాలుగు మున్సిపాలిటీలకు రూ.6.5 కోట్ల నిధులు
- ఇప్పటికే వికారాబాద్, తాండూరు మున్సిపాలిటీల్లో పనులు ప్రారంభం
-పరిగి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పూర్తి
- కొడంగల్ మున్సిపాలిటీలో పనులకు ప్రతిపాదనలు సిద్ధం
-తాండూరు మున్సిపాలిటీలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మున్సిపాలిటీలను కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకుగాను తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీలతోపాటు కొత్త మున్సిపాలిటీలైన పరిగి, కొడంగల్ మున్సిపాలిటీలకు కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసింది. అయితే సంబంధిత నిధులతో మున్సిపాలిటీల్లో వివిధ అభివృద్ధి పనులను చేపట్టడంతోపాటు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను సుందరంగా తీర్చిదిద్దేందుకుగాను అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు.

మున్సిపాలిటీల్లో రోడ్లను అభివృద్ధిలోకి తీసుకురావడంతోపాటు మురుగుకాల్వల నిర్మాణం, వీధిదీపాల ఏర్పాటు, పార్కుల నిర్మాణం,
అండర్‌డ్రైనేజీ నిర్మాణం, బీటీ రోడ్ల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ పనులు, వైకుం డంపింగ్ యార్డుల నిర్మాణం, ప్రధాన కూడళ్ల అభివృద్ధి, కొత్త మున్సిపాలిటీల్లో మున్సిపాలిటీ భవనాల నిర్మించేందుకుగాను జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ప్రతిపాదనలను సిద్ధం చేశారు. అయితే వికారాబాద్, తాండూరు మున్సిపాలిటీల్లో ఇప్పటికే అభివృద్ధి పనుల ప్రతిపాదనలను పూర్తి కావడంతోపాటు టెండర్లు కూడా పూర్తికాగా పనులు కొనసాగుతుండగా, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు పూర్తికాగా మరో రెండు, మూడు రోజుల్లో టెండర్ల ప్రక్రియ షురూ కానుంది. అయితే నాలుగు మున్సిపాలిటీలకుగాను రూ.6.5 కోట్లు విడుదలకాగా తాండూరు మున్సిపాలిటీకి రూ.36.5 కోట్లు, వికారాబాద్ మున్సిపాలిటీకి రూ.20 కోట్లు, పరిగి మున్సిపాలిటీకి రూ.15 కోట్లు, కొడంగల్ మున్సిపాలిటీకి రూ.15 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.

రూ.32.5 కోట్లతో తాండూరు మున్సిపాలిటీలో పనులు..
తాండూరు మున్సిపల్ పరిధిలో రూ.36.5 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రధాన రోడ్లకు రూ. 32.5 కోట్ల నిధులు, అలాగే వార్డుల్లో రూ. 4 కోట్ల నిధులతో రోడ్లు, మురుగు కాల్వల పనులు చేపట్టారు. రోడ్ల విస్తరణకు తెలంగాణ అర్బన్ అండ్ ఫైనాన్స్ ఇన్‌వూపాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా (పట్టణ ప్రాం తాల మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ) మొదటి దశలో మంజూరైన రూ.25 కోట్ల తో పాటు అలాగే ప్లాన్ గ్రాంటు కింద సీఎం ప్రత్యేక కోటా ద్వారా మంజూరైన రూ. 7.5 కోట్ల నిధులు మొత్తం రూ. 32.5 కోట్లతో పట్టణంలో నాలుగు రోడ్ల పనులకు గతంలో శంకుస్థాన జరిగింది.మున్సిపల్ పరిధిలోని రోడ్ల విస్తరణ పనులను ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించారు. దీంతో పట్టణంలో దాదాపు 6.25 కిలో మీటర్ల పొడవు మేర ప్రధాన రహదారులు, ఇంటర్నల్ రహదారుల విస్తరణ జరుగుతోంది. 16 అంగుళాల మందంతో కనీసం 66 అడుగుల వెడల్పుతో చేపడుతున్న ఈ రోడ్లన్నీ సీసీ పనులతో అందంగా మారుతున్నాయి. దీంతో పట్టణంలో ప్రధానంగా రైల్వే స్టేషన్ రోడ్డు మార్గంలో ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తీరనున్నాయి.

తాండూరు పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని ముందుగా రోడ్ల విస్తరణకు మాజీ మంత్రి మహేందర్‌డ్డి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో భాగంగా తాండూరు పట్టణంలోని మున్సిపల్ రోడ్లను, ఆర్‌అండ్‌బీ రోడ్లను విస్తరించేందుకు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. తాండూరు పట్టణంలో మున్సిపల్ రోడ్ల అభివృద్ధికి రూ. 32.5 కోట్ల నిధులతో పలు రోడ్లను సీసీ రహదారులుగా 20 మీటర్ల వెడల్పుతో వేస్తున్నారు. మరి కొన్ని రోడ్లను 14 మీటర్ల వెడల్పుతో వేస్తున్నారు. 20 మీటర్ల వెడల్పుతో వేసే రోడ్డు ఒక వైపు 10 మీటర్లు ఉంటుంది. ఎత్తు 16 అంగుళాలు మందంతో ఉంటుంది. 14 మీటర్ల వెడల్పుతో వేసే రోడ్డు ఒక వైపు 7 మీటర్లు ఉండనుంది. సెంట్రల్ లైటింగ్, డివైడర్‌ల కోసం మీటరున్నర దిమ్మెలు నిర్మిస్తారు. ఐదు బిట్లుగా రోడ్లను నిర్మిస్తున్నారు. తాండూరు పట్టణంలోని ఇందిరాచౌక్ నుంచి రైల్వేస్టేషన్ వరకు రూ. 6.కోట్లతో 450 మీటర్ల రోడ్డును (20మీటర్ల రోడ్డు),రూ.4.5 కోట్ల వ్యయంతో జిల్లా దవాఖానా క్వార్టర్ల నుంచి మాజీ మంత్రి మహేందర్‌డ్డి ఇంటి వరకు, అలాగే బస్టాండు నుంచి శాంత్‌మహల్ చౌరస్తా వరకు 750 మీటర్ల రోడ్డును 14 మీటర్ల రోడ్డు (ఇరు వైపులా 7+7 మీటర్ల రోడ్డు) నిర్మిస్తారు.

అలాగే శివాజీ చౌక్‌నుంచి పాండురంగ ఆలయం వరకు రూ.7.5 కోట్లతో 1.2 కిలో మీటర్ల దూరం( ఇరు వైపులా 7+7 మీటర్ల రోడ్డు), డీఎస్పీ కార్యాలయం నుంచి పాత తాండూరు రైల్వే గేట్ వరకు రూ.2.2 కోట్లతో 350 మీటర్ల రోడ్డును 14 మీటర్ల రోడ్డు (ఇరు వైపులా 7+7 మీటర్ల రోడ్డు) నిర్మాణం చేపడుతున్నారు. అలాగే రూ.4 కోట్లతో ఖాంజాపూర్ గేట్ నుంచి తాండూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ వరకు ఖాంజాపూర్ గేట్ నుంచి విలియమూన్ హైస్కూల్ చౌరస్తా వరకు 3.5 కిలో మీటర్ల సెంట్రల్ డివైడర్ పనులు చేపట్టారు. ఇప్పటికే సగం పనులు పూర్తయినాయి. పూర్తయిన డివైడర్‌లో పచ్చదనాన్నిచ్చే, అందాలు చిందించే మొక్కలను కూడా పెంచుతున్నారు.

ఈ హైదరాబాద్-తాండూరు ఆర్‌అండ్‌బి రోడ్డు మార్గంలోని ఖాంజాపూర్ నుం,ఇ తాండూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ వరకు రోడ్ డివైడర్‌లతో పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేసే పనులు కూడా రోడ్ల నిర్మాణం పూర్తయిన తరువాత ప్రారంభిస్తారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్ నుంచి విలిమూన్ హైస్కూల్ వరకు రూ.7.5 కోట్ల వ్యయంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించగా ఒక వైపు రోడ్డు పనులు పూర్తయినాయి. మరో వైపు రోడ్డు పనులు చేపట్టనున్నారు. ఈ ప్రధాన రోడ్డును 40అడుగుల రోడ్డుగా విస్తరిస్తున్నారు. అంతేకాకుండా తాండూరు పట్టణంలో 2017-1 ఆర్థిక సంవత్సరానికి గాను 14వ ఆర్థిక సంఘం ద్వారా రూ. 2.5 కోట్లు, ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా మరో రూ.1.5 కోట్ల నిధులు మంజూరు కావడంతో ఈ నిధులతో పట్టణంలోని 31 వార్డుల్లో చిన్న చిన్న మురుగు కాల్వలు, సీసీ రోడ్ల పనులు చేపట్టారు. వచ్చే మార్చి నెలాఖరు వరకు పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

వికారాబాద్ మున్సిపాలిటీకి రూ.20 కోట్లు...
వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రూ.20 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టారు. ఇప్పటికే టెండర్లు కూడా పూర్తి కావడంతో పనులు ప్రారంభమయ్యాయి. సంబంధిత మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనుల చేప ప్రతిపాదించారు. రూ. 5 కోట్లతో శివసాగర్ చెరువు సమీపంలో పార్కు నిర్మాణం, రూ.1 కోటితో గాంధీ పార్కు అభివృద్ధి, రూ.1 కోటితో ఐడీఎస్‌ఎంటీ ఇండస్టీరియల్ వద్ద భవన నిర్మాణం, రూ.2 కోట్లతో సాకేత్‌నగర్, కమలానగర్‌లలో పార్కుల అభివృద్ధి, రూ.50 లక్షలతో స్లాటర్ హౌజ్, జంతువధశాల ఏర్పాటు, రూ.1.50 కోట్లతో మేకల గండి వద్ద డంపింగ్ యార్డు ఏర్పాటు, రూ.1 కోటితో గంగారం సమీపంలో వైకుంఠధామం ఏర్పాటు, రూ.4 కోట్లతో ఎన్నేపల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు సెంట్రల్ లైటింగ్‌తో పాటు రోడ్డు నిర్మాణం, రూ.1 కోటితో ఎన్టీఆర్ చౌరస్తా నుంచి బీజేఆర్ చౌరస్తా వరకు సెంట్రల్ లైటింగ్‌తో పాటు రోడ్డు నిర్మాణం, రూ.1. కోటితో బీజేఆర్ చౌరస్తా నుంచి ఆలంపల్లి చౌరస్తా వరకు సెంట్రల్ లైటింగ్‌తో పాటు రోడ్డు నిర్మాణం, రూ.2 కోట్లతో బీజేఆర్ చౌరస్తా నుంచి రమయ్యగూడ వరకు సెంట్రల్ లైటింగ్‌తో పాటు రోడ్డు నిర్మా ణం, పార్కుల్లో వాకింగ్‌వూటాక్స్, గ్రీనరి,ఆర్చ్‌లు, మ్యూజికల్ ఫౌంటెన్, పిల్లలకు ఆట వస్తువులు, పార్కుల్లో కూర్చోడానికి బెంచీలు తదితర సదుపాయాలతో అందంగా తీర్చిదిద్దేందుకు పనులు చేపట్టారు.

పరిగి, కొడంగల్ ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్లు...
పరిగి మున్సిపాలిటీలో రూ.15 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ప్రధానంగా రూ..44 కోట్ల నిధులను రోడ్ల నిర్మాణంతోపాటు రోడ్ల అభివృద్ధికి కేటాయించేందుకు ప్రతిపాదించారు. ఎమ్మార్వో కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకుగల బీటీ రోడ్డు విస్తరణకు రూ.1.67 కోట్లు, గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.1.44 కోట్లు, బ్రిడ్జి నుంచి రెసిడెన్షియల్ కాలేజీ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.71 కోట్లు, కొడంగల్ రహదారిలోని పలు కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.1.2 కోట్లు, మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో అంతర్గత సీసీ రోడ్లతోపాటు కాలువల నిర్మాణానికి రూ.1.5 కోట్లు, ఎమ్మార్వో కార్యాలయం నుంచి పోస్టాఫీస్ వరకు సింగిల్ డివైడర్‌తో కూడిన సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.49 లక్షలు, రూ.5.50 లక్షలతో మున్సిపాలిటీ పరిధిలో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు,

డ్రైనేజీ కాలువల నిర్మాణానికి రూ.20 లక్షలు, ప్రధాన కూడళ్ల విస్తరణకు రూ.కోటి, రూ.కోటితో డంపిండ్ యార్డు ఏర్పాటు, రూ.50 లక్షలతో తుంకులగడ్డ వద్దగల ముస్లీంల వైకుంఠాధామం అభివృద్ధి, రూ.3 కోట్లతో కొత్త మున్సిపల్ కార్యాలయం నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేశారు. అదేవిధంగా కొడంగల్ మున్సిపాలిటీకి 15 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో చేయాల్సిన అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. అయితే రూ. కోట్లతో మున్సిపాలిటీ అంతా అండర్‌క్షిగౌండ్ డ్రైనేజీతోపాటు విధీ దీపాలు ఏర్పాటు చేయడం, పార్కు ఏర్పాటు, కొడంగల్ పట్టణంలోని వినాయక చౌరస్తా నుంచి వెంక స్వామి ఆలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పనుల ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...