టెన్నికాయిట్ పోటీల్లో తెలంగాణ హవా


Tue,February 19, 2019 11:24 PM

వికారాబాద్ టౌన్ : ఆటల్లో గెలుపు ఓటములు సహజమేనని, ఓడిన వారు నిరుత్సాహపడకుండా మరోసారి ప్రయత్నం చేస్తే తప్పక విజయం సాధిస్తారని ఎస్పీ అన్నపూర్ణ సూచించారు. వికారాబాద్ పట్టణంలోని సెయింట్ జూడ్స్ పాఠశాల ఆవరణలో మూడు రోజులుగా జరుగుతున్న 64వ జాతీయ టెన్నికాయిట్ అండర్ 17 బాల, బాలికల పోటీలు మంగళవారం ముగిశాయి. పోటీల్లో తెలంగాణ బాలికల జట్టు ఆంధ్రవూపదేశ్ జట్టుపై విజయం సాధించి ప్రథమ బహుమతి సాధించి, తెలంగాణ బాలురు ఫైనల్స్‌లో మహారాష్ట్ర బాలుర జట్టుపై విజయం సాధించి మొదటి బహుమతి పొందారు. ఈ పోటీల్లో 10 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సుమారు 100 మంది పాల్గొన్నారు. ముగింపు కార్యక్షికమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరై విజేతలకు ట్రోఫీని అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలు ఆడ డం వల్ల శారీరక, మానసిక ఏకాక్షిగత పెరుగుతుందని పే ర్కొన్నారు. చిన్న తనం నుంచే క్రీడలపై పట్టు సాధించి జాతీ య స్థాయిలో మంచి ప్రతిభ ను కనబర్చి దేశానికి, మన ప్రాంతానికి పేరు ప్రతిష్టలు సాధించి క్రీడాకారులుగా త యారు కావాలన్నారు. ఆయా రంగాల్లో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు స్పోర్డ్స్ కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాలు వరిస్తాయని సూచించారు. మండల స్థాయి నుంచి జాతీయ స్థాయిలో ఆడడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇదే స్థాయి విద్యార్థులు మరింతగా రాణించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థులను ఈ స్థాయికి తీసుకొచ్చిన శిక్షకులను అభినందించారు. అదేవిధంగా టెన్నికాయిట్ పోటీలో గెలుపొందిన తెలంగాణ బాల, బాలికల జట్లకు చాంపియన్‌షిప్ ట్రోఫీని ఆమె అందించారు.

ద్వితీయ స్థానంలో గెలుపొందిన ఆంధ్రవూపదేశ్ బాలికల జట్టు, మహారాష్ట్ర బాలుర జట్టు ద్వితీయ స్థానంలో గెలుపొందాయి. బాలుర, బాలికల పోటీల్లో తమిళనాడుకు జట్టు మొదటి స్థానంలో ఉన్నారు. వీరికి ఆర్గనైజర్ సెక్రటరీలు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయా పాఠశాలల విద్యార్థులు సంస్కృతిక కార్యక్షికమాలు నిర్వహించారు. వీరికి ఎస్పీ బహుమతులు అందజేశారు. అనంతరం ఎస్పీ అన్నపూర్ణను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్షికమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లికార్జున్, జాతీయ ఆబ్జర్‌వర్ దినేష్, రాష్ట్రస్థాయి అబ్జర్వర్ శ్యాంసుందర్, పీఈటీలు ప్రతాప్‌డ్డి, నర్సింహులు, గంగన్న, చంద్రశేఖర్‌డ్డి, రాజేందర్‌డ్డి, శివవూపసాద్, ప్రభాకర్ పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...