బ్రాహ్మణ సమాఖ్య సమావేశం


Tue,February 19, 2019 11:23 PM

కొడంగల్, నమస్తే తెలంగాణ : వికారాబాద్ జిల్లాలోని అనంతరగిరిలో వచ్చే నెల మార్చి 6వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ సమాఖ్య కార్యనిర్వాహణ సమావేశంపై మంగళవారం మండలంలోని టేకల్‌కోడ్ గ్రామంలో జిల్లా బ్రాహ్మణ సమాఖ్య కోశాధికారి లక్ష్మణ్‌రావు ఇంట్లో జిల్లా స్థాయి బ్రాహ్మణ సమాఖ్య సభ్యుల సమావేశం జరిగింది. ఇందులో వికారాబాద్, కొడంగల్, పరిగి, తాండూర్ నియోజకవర్గ పరిధిలో సంఘం సభ్యులు పాల్గొని జిల్లా స్థాయి సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై సంఘం సభ్యులు తమతమ అభివూపాయాలను వెల్లడించారు. సమావేశంలో చేపట్టాల్సిన తీర్మాణాలను, ప్రణాళికలను తీర్మాణాలు చేపట్టుకున్నారు. రాష్ట్రస్థాయి సమావేశాన్ని విజయవంతం చేసేందుకు గాను ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర బ్రాహ్మణ సమాఖ్య కార్యవర్గ సభ్యులు బోడుబట్ల రాఘవేంద్రా చార్యులు కోరారు. సమావేశాన్ని పురస్కరించుకొని శ్రీ రాఘవేంవూదస్వామి అష్టోత్తరం, శ్రీ సత్యనారాయణస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిదంగా మ్ముకశ్మీ పుల్వామా జిల్లా అవంతిపురాలో జరిగిన సంఘటనలో అమరులైన వీర జవానులకు నివాళ్ళు అర్పిస్తూ.. మౌనం పాటించారు. అలాగే కొడంగల్, పరిగి పరిధిలో పంచాయతీ ఎన్నిల్లో గెలుపొందిన బ్రాహ్మణ సమాఖ్య ఉప సర్పంచ్‌లకు, వార్డు సభ్యులను సన్మానించారు. అనంతరం పాల్గొన్న వారికి స్వామి వారి తీర్థ ప్రసాదాల వితరణ చేపట్టారు. ఈ కార్యక్షికమంలో జిల్లా అధ్యక్షుడు కళ్యాణరావు, గౌరవ అధ్యక్షుడు సిద్దాంతి పార్థిసారథి, జిల్లా కార్యదర్శి రాఘవేందర్‌రావులతో పాటు కొడంగల్ బ్రాహ్మణ సమాఖ్య సభ్యులు జయతీర్థాచారి, అక్కి శ్రీనివాసాచారి, కిట్టుస్వామి, యజ్ఞనారాయణ పురోహిత్, ప్రకాశ్‌శర్మ, దత్తావూతేయరావు, తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...