జర్నలిస్టు కుటుంబాలకు ప్రభుత్వం బాసట


Tue,February 19, 2019 11:23 PM

- సీఎం కేసీఆర్ జర్నలిస్టు సంక్షేమ నిధి ద్వారా భరోసా
- మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు
- ఆర్థిక సాయంతో పాటు వారి పిల్లల విద్యకు చేయూత
-ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
వికారాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల కుటుంబాలకు బాసటగా నిలుస్తూ జర్నలిస్టులకు చేయుతనిస్తుందని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ నాంపల్లి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే క్రాంతి కుమార్‌ల చేతుల మీదుగా మృతి చెందిన జర్నలిస్టులు నర్సింహాడ్డి భార్య విజయలక్ష్మి, నర్సింహులు భార్య కవిత, అమృతయ్య భార్య లలితలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా అల్లం నారాయ ణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభు త్వం జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి జర్నలిస్టుల కుటుంబాలకు కొండం త అండగా నిలుస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు భరోసా కల్పిస్తూ వారికి చేయుతనివ్వడం జరుగుతుందన్నారు. మృతి చెందిన జర్నలిస్టు భార్యకు ప్రతినెల రూ.3వేల పింఛన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అదే విధంగా చదువుకుంటున్నవారి పిల్లలకు నెలకు రూ.1000చొప్పున చెల్లిస్తుంద న్నారు.ఈ కార్యక్షికమంలో సీనియర్ జర్నలిస్టులు,టీయూడబ్ల్యూజే యూనియన్ నాయకులు తదితరులు ఉన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...